
బిగ్ బాస్ తెలుగు 9 నుంచి దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అక్టోబర్ 12న హౌజ్‌లోకి వచ్చిన మాధురి, కేవలం 22 రోజుల్లోనే బయటికొచ్చింది. ఆమె ఎంత రెమ్యునరేషన్ పొందింది, మీమర్స్ వల్లే ఎలిమినేట్ అయ్యిందా అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Key Points
దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు 9 నుంచి ఎలిమినేట్ అయింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అక్టోబర్ 12న వచ్చి 22 రోజులు హౌజ్‌లో ఉంది.
ఆమె వారానికి రూ. 40 వేలు రెమ్యునరేషన్ అందుకుంది.
భరణి శంకర్, మాధురిపై వచ్చిన మీమ్స్ వల్లే ఎలిమినేషన్ జరిగి ఉండొచ్చని అంచనా.
ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన దివ్వెల మాధురి
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి దివ్వెల మాధురి ఎలిమినేట్ అయిపోయింది. దీనికి సంబంధించిన ఎలిమినేషన్ షూటింగ్ శనివారం జరిగిపోయింది. దీనిని ఇవాళ (నవంబర్ 2) ప్రసారం చేయనున్నారు. అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్వెల మాధురి బిగ్ బాస్ రెమ్యునరేషన్, 22 రోజుల్లో సంపాదించింది ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. వీకెండ్‌లో భాగంగా శనివారం వచ్చిన హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ఆట తీరుపై రివ్యూ ఇచ్చారు. ఇక ఎనిమిదోవారం పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నుంచి ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ఎంత సంపాదించింది?
దాంతో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేన్స్ నిర్వహించారు. బిగ్ బాస్ తెలుగు 9 ఈవారం నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది ఉన్నారు. వారిలో తనూజ గౌడ, కల్యాణ్ పడాల, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, డీమాన్ పవన్, రాము రాథోడ్, సంజన గల్రానీ, దువ్వాడ మాధురి ఉన్నారు.
ఇవాళ (నవంబర్ 2) దివ్వెల మాధురి ఎలిమినేషన్‌ను ప్రసారం చేయనున్నారు. అయితే, దివ్వెల మాధురికి రెమ్యునరేషన్ కింద వారానికి రూ. 40 వేలు ఇచ్చినట్లు సమాచారం. వైల్డ్ కార్డ్‌గా అక్టోబర్ 12న బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ 2.Oతో ఎంట్రీ ఇచ్చిన మాధురి హౌజ్‌లో 22 రోజులు ఉంది.
దివ్వెల మాధురి ఎలిమినేషన్‌కు మీమర్స్ కారణమా?
ఇందుకు కారణం మీమర్స్ అని అంటున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో భరణి శంకర్, మాధురిని లింక్ చేస్తూ లవ్ రిలేషన్‌షిప్ పోస్ట్‌లు, లవ్ బీజీఎమ్స్‌తో, రొమాంటిక్ యాంగిల్‌లో మీమ్స్ తెగ పడ్డాయి. ఎలిమినేట్ అయిన భరణి శంకర్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో అవి మరింత జోరందుకున్నాయి.
దివ్వెల మాధురి ఎలిమినేషన్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. మీమర్స్ పాత్ర, ఆమె రెమ్యునరేషన్ వివరాలు షోపై మరింత ఆసక్తిని పెంచాయి. బిగ్ బాస్ లోకి భరణి రీఎంట్రీ, మాధురి నిష్క్రమణ పట్ల స్పందనను వేచి చూడాలి.


