|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Divya Khosla: బాలీవుడ్ అంతా ముసలోళ్ల రాజ్యం అయిపొయింది.. దివ్య ఖోస్లా సంచలన కామెంట్స్

Published: 05-12-2025, 11:49 PM
Divya Khosla: బాలీవుడ్ అంతా ముసలోళ్ల రాజ్యం అయిపొయింది.. దివ్య ఖోస్లా సంచలన కామెంట్స్
  • బాలీవుడ్‌ అంతా ముసలోళ్లతో నిండిపోయిందని దివ్య ఖోస్లా సంచలన వ్యాఖ్యలు.
  • అవకాశాల కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకోలేనని స్పష్టం చేసిన దివ్య ఖోస్లా.
  • కెరీర్‌లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కష్టపడినట్లు వెల్లడి.
  • తన విడాకుల వార్తల్లో నిజం లేదని దివ్య ఖోస్లా తేల్చి చెప్పింది.

బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా సినీ పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ అంతా ముసలోళ్లతో నిండిపోయిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే తన విడాకుల వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. దివ్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

బాలీవుడ్‌పై దివ్య ఖోస్లా సంచలన వ్యాఖ్యలు

Divya Khosla: బాలీవుడ్ ఇండస్ట్రీపై నటి దివ్య ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేసింది. అక్కడ అంతా ముసలోళ్లతో నిండిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఈ బ్యూటీ ఓ ఆస్క్ మీ ఎనిథింగ్ అనే సెషన్ లో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇందులో భాగంగా ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఇలా మాట్లాడింది. బాలీవుడ్ అంతా ముసలోళ్లతో నిండిపోయింది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

కష్టాల గురించి దివ్య ఖోస్లా కామెంట్స్

JD Chakravarthy: ఇన్‌స్టాగ్రామ్‌లో జేడీ చక్రవర్తి ఎంట్రీ.. దేవుడు కాదు దేవుళ్ళు.. మొదటి పోస్ట్ తోనే షేక్ చేశాడుగా..

విడాకుల వార్తలపై దివ్య ఖోస్లా స్పందన

ఇక్కడ నిజాయితీగా ఉండటం చాలా అవసరం. సినిమాల అవకాశాల కోసం ఆత్మ గౌరవాన్ని అమ్ముకోలేను. ఒక సినిమా కోసం యూకేలో జీరో డిగ్రీ టెంపరేచర్‌లో 42 రోజులు పని చేశాను. అది నా కెరీర్ లోనే షూట్. మరోసారి మైనస్ 10 డిగ్రీలలో కూడా ఆగకుండా పని చేశాను. ఆ సన్నివేశాలు నాకు బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేశాయి’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అలాగే తన విడాకుల గురించి కూడా మాట్లాడింది దివ్య ఖోస్లా(Divya Khosla). మీరు విడాకులు తీసుకున్నారా అని ఒకరు అడగగా.. “విడాకుల వార్తల్లో నిజం లేదు. కానీ, మీడియా అలా కావాలని కోరుకుంటుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొత్తంగా, దివ్య ఖోస్లా బాలీవుడ్ పరిస్థితులు, తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె ధైర్యమైన అభిప్రాయాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.