|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దివ్వల మాధురి ఎలిమినేటెడ్, వెళ్లిపోవాలని నేనే కోరుకున్నా.. తనూజని చూసి కన్నీళ్లు

Published: 02-11-2025, 10:52 PM
దివ్వల మాధురి ఎలిమినేటెడ్, వెళ్లిపోవాలని నేనే కోరుకున్నా.. తనూజని చూసి కన్నీళ్లు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఫైర్ బ్రాండ్ దివ్వల మాధురి ఎలిమినేట్ అయ్యారు. తనూజ వద్ద గోల్డెన్ బజర్ ఉన్నప్పటికీ ఆమె మాధురిని సేవ్ చేయలేదు. ఎలిమినేషన్ తర్వాత “నేను వెళ్లిపోవాలని కోరుకున్నాను” అని మాధురి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Key Points

1

దివ్వల మాధురి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు.

2

తనూజ తన గోల్డెన్ బజర్‌ను ఉపయోగించి మాధురిని సేవ్ చేయ నిరాకరించింది.

4

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి 'ది గర్ల్ ఫ్రెండ్' ప్రమోషన్స్ కోసం అతిథులుగా వచ్చారు.

బిగ్ బాస్ 9లో ఊహించని ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ సండే ఎపిసోడ్ లో ఊహించని పరిణామం ఎదురైంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఫైర్ బ్రాండ్ దివ్వల మాధురి ఎలిమినేట్ అయ్యారు. దివ్వల మాధురి, గౌరవ్ గుప్తా ఇద్దరూ ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నారు. తెలుగు మాట్లాడేందుకు కూడా తడబడుతున్న గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అవుతాడని కొందరు భావించారు. కానీ దివ్వల మాధురి ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వెళ్లారు.

ఈవారం నామినేషన్స్ లో రాము, తనూజ, మాధురి, గౌరవ్ గుప్తా, రీతూ చౌదరి, పవన్, సంజన, కళ్యాణ్ ఉన్నారు. వీరిలో ముందుగా పవన్ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత బిగ్ బాస్ వేదికపైకి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నటీనటులు రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి వచ్చారు. నాగార్జున వారిని అడిగి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ విశేషాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడించారు. ఏదైనా సినిమాలోని సన్నివేశం చూపిస్తారు. ఇంటి సభ్యులు ఆ సీన్ ని రీ క్రియేట్ చేసి నటించి చూపించాలి.

తనూజ నిర్ణయంతో షాక్ అయిన మాధురి

రష్మిక వారి పెర్ఫార్మెన్స్ కి మార్కులు ఇవ్వాలని నాగార్జున కోరారు. ఇమ్మాన్యుయేల్ ప్రతి రోజూ పండగే చిత్రంలో రావు రమేష్ డైలాగులు చెప్పి అలరించారు. కళ్యాణ్, తనూజ పోకిరి మూవీలో లిఫ్ట్ సీన్ ని రీ క్రియేట్ చేశారు. భరణి యమదొంగ చిత్రంలో ఏమంటివి ఏమంటివి డైలాగ్ చెప్పారు. ఇలా రష్మిక ఉన్నంత సేపు సరదాగా సాగింది.

ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేసే ప్రక్రియ వేగవంతం అయింది. సంజన, కళ్యాణ్, రాము సేవ్ అయ్యారు. మరో రౌండ్ లో తనూజ కూడా సేవ్ అయింది. చివరికి నామినేషన్స్ లో గౌరవ్, మాధురి మాత్రమే మిగిలారు. వారిని గార్డెన్ లో ఉన్న కారులో కూర్చోమని నాగార్జున అడిగారు. ఆ కారు బయటకి వెళుతుంది. ఒకరు మాత్రమే హౌస్ లోకి తిరిగి వస్తారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మాధురి అతి తక్కువ ఓట్లతో ఉన్నారు. తనూజ వద్ద గోల్డెన్ బజర్ ఉంది. తనూజ దానిని ఇప్పుడైనా, ఇంకెప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.

మాధురి సంచలన వ్యాఖ్యలు: వెళ్లాలని కోరుకున్నా

ఇప్పుడు ఉపయోగించి మాధురిని సేవ్ చేసే అవకాశం నీకు ఉంది. అది నీ ఇష్టం అని నాగార్జున అడిగారు. కానీ తనూజ మాత్రం దానిని తాను తర్వాత ఎప్పుడైనా వాడతానని.. ఇప్పుడు మాధురిని సేవ్ చేయడం లేదని సంచలన నిర్ణయం తీసుకుంది. దీనితో నాగార్జున మాధురి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీనితో మాధురి బిగ్ బాస్ వేదికపై వెళ్లి నాగార్జునని కలిసింది. ఎలిమినేట్ అవుతావని ఊహించావా అని నాగార్జున ప్రశ్నించగా మాధురి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నేను ఊహించాను, వాస్తవానికి నేనే వెళ్లిపోవాలని అనుకున్నాను. ఎందుకంటే త్వరలో మా ఆయన బర్త్ డే ఉంది అని మాధురి పేర్కొంది. ఆ తర్వాత మాధురి తనూజ తో ఉన్న రిలేషన్ ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది, హౌస్ లో తనూజ, కళ్యాణ్ ఇద్దరూ చాలా స్వీట్ అని తెలిపింది. హౌస్ లో ఫేక్ అంటే మాత్రం అది భరణి గారే. ఆయన బ్యాక్ బిచింగ్ చేస్తారు అంటూ షాకిచ్చింది.

దివ్వల మాధురి ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద చర్చకు దారితీసింది. తనూజ నిర్ణయం, మాధురి సంచలన వ్యాఖ్యలు ప్రేక్షకుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే వారాల్లో హౌస్‌లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.