|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం! హైదరాబాద్‌లో డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్ ప్రారంభం! ఉచిత చర్మ సంరక్షణతో 1.3 మిలియన్ ఫాలోవర్ల సంబరం!

Published: 16-03-2026, 2:35 PM
సంచలనం! హైదరాబాద్‌లో డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్ ప్రారంభం! ఉచిత చర్మ సంరక్షణతో 1.3 మిలియన్ ఫాలోవర్ల సంబరం!
  • డాక్టర్ ప్రియాంక రెడ్డికి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
  • జూబ్లీహిల్స్‌లో డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్‌ను డాక్టర్ ప్రియాంక రెడ్డి ప్రారంభించారు.
  • క్లినిక్ ప్రారంభోత్సవంలో 100 మందికి ఉచిత చర్మ సంరక్షణ సెషన్స్ నిర్వహించారు.
  • ఆధునిక సాంకేతికతతో వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా చికిత్సలు అందిస్తామని డాక్టర్ ప్రియాంక రెడ్డి తెలిపారు.

ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక రెడ్డి హైదరాబాద్‌లో డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ క్లినిక్ ద్వారా అత్యాధునిక చర్మ, సౌందర్య చికిత్సలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రారంభోత్సవంలో 100 మందికి ఉచిత సెషన్స్‌ను నిర్వహించారు.

డాక్టర్ ప్రియాంక రెడ్డి సంచలనం

ప్రస్తుతం ఒక కంటెంట్ రీచ్ అవ్వాలంటే అందుకు బెస్ట్ ఆప్షన్ సోషల్ మీడియా. వైద్య సలహాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు డాక్టర్ ప్రియాంక రెడ్డి. వైద్య సూచనలు ఇస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 1.3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

అంతటి క్రేజ్ సాధించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్‌లో అత్యాధునిక చర్మ, సౌందర్య చికిత్సా సేవలను అందించే డీఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్ క్లినిక్‌‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభత్సవానికి వైద్య నిపుణులు, చర్మ సంరక్షణ, బ్యూటీ రంగ నిపుణులు హాజరయ్యారు.

డాక్టర్ ప్రియాంక రెడ్డి స్థాపించిన డీఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్, ఆధునిక డెర్మటాలజీ చికిత్సలు, ఏస్థెటిక్స్ సేవలను అందిస్తూ చర్మ ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పని చేయనుంది.

డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్ ప్రారంభం

ఈ క్లినిక్‌లో అత్యాధునిక వైద్య సాంకేతికతతో పాటు నిపుణుల సలహాలు అందిస్తూ, వైద్య, సౌందర్య చర్మ సమస్యలకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలు అందించనున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ లో ఆధునిక డెర్మటాలజీ సేవలను అందించేందుకు ఈ క్లినిక్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు.

“శాస్త్రీయంగా నిరూపితమైన చికిత్సలు, సురక్షితమైన ఏస్థెటిక్స్ ప్రక్రియలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన చర్మ సంరక్షణ పరిష్కారాలను అందించడం మా లక్ష్యం. ఎవరికి చర్మానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరమో వాళ్లకి తగినట్టుగా కేవలం అవసరమైనంత మేరకు మాత్రమే మనం చికిత్స అందిస్తాము” అని డాక్టర్ ప్రియాంక రెడ్డి పేర్కొన్నారు.

ఉచిత చర్మ సంరక్షణ సెషన్స్

అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ క్లినిక్‌లో వివిధ రకాల డెర్మటాలజీ, ఏస్థెటిక్స్ చికిత్సలు సమగ్రంగా అందించనున్నారు. సౌకర్యవంతమైన, ఆధునిక వాతావరణంలో నిపుణుల చేత ఉత్తమ సేవలను పొందగలుగుతారని ఆమె వెల్లడించారు. హైదరాబాద్‌లో చర్మ, సౌందర్య సంరక్షణలో కొత్త మైలురాయిగా నిలుస్తామని పేర్కొన్నారు.

ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మందికి ప్రత్యేక మాస్టర్‌క్లాస్, కన్సల్టేషన్ సెషన్స్‌ని ఉచితంగా నిర్వహించారు . ఈ సెషన్‌లో పాల్గొనే వారికి తాజా డెర్మటాలజీ అభివృద్ధులు, చర్మ పునరుజ్జీవనం (Skin Rejuvenation), ఆధునిక ఏస్థెటిక్స్ చికిత్సల గురించి అవగాహన కల్పించారు. అలాగే నిపుణులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కూడా అందించారు.

డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో చర్మ సంరక్షణకు ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని డాక్టర్ ప్రియాంక రెడ్డి పేర్కొన్నారు. ఆధునిక చికిత్సలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.