|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జై శ్రీరామ్ అంటే ఫీజు తగ్గించిన డాక్టర్! బెంగాల్‌లో దుమారం రేపిన ఆఫర్!

Published: 14-04-2026, 9:05 AM
జై శ్రీరామ్ అంటే ఫీజు తగ్గించిన డాక్టర్! బెంగాల్‌లో దుమారం రేపిన ఆఫర్!
  • బెంగాల్‌లో ‘జై శ్రీరామ్’ అని చెబితే ఫీజులో రూ.500 తగ్గింపు ఆఫర్ ప్రకటించిన డాక్టర్ పీకే హజ్రా.
  • తన సొంత క్లినిక్‌లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని డాక్టర్ హజ్రా స్పష్టీకరణ.
  • బీజేపీ సిద్ధాంతాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపిన డాక్టర్ హజ్రా.
  • డాక్టర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ, విమర్శిస్తూ నెటిజన్ల కామెంట్స్.

కోల్‌కతాకు చెందిన డాక్టర్ పీకే హజ్రా సంచలన ప్రకటన చేశారు. తన క్లినిక్‌కు వచ్చే రోగులు ‘జై శ్రీరామ్’ అని పలికితే కన్సల్టేషన్ ఫీజులో రూ.500 డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించారు. ఈ ఆఫర్ రాజకీయంగా దుమారం రేపుతోంది.

వైద్యుడి ఆఫర్: రూ.500 డిస్కౌంట్!

పశ్చిమ బెంగాల్‌లో ఒక డాక్టర్ తన రోగుల కోసం ప్రకటించిన వినూత్న ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన క్లినిక్‌కు వచ్చే రోగులు ‘జై శ్రీరామ్’ (Jai Shri Ram) అని పలికితే వారికి కన్సల్టేషన్ ఫీజులో రూ.500 డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కోల్‌కతాకు (Kolkata) చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీకే హజ్రా (Doctor PK Hazra) ఓ న్యూస్ ఎజెన్సీతో మాట్లాడుతూ.. తన కన్సల్టేషన్ ఫీజు ముందుగా రూ. 2000 ఉండేది. ప్రజలు సహాయం చేసేందుకు తొలుత రూ.1500 లకు తగ్గించాను. కానీ ఇప్పుడు నేను మరొక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎవరైనా జై శ్రీరామ్ అంటే వారికి మరో రూ.500 తగ్గించి వారి వద్ద కేవలం రూ. 1000 మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ కేవలం తన సొంత క్లినిక్‍లో కన్సల్టేషన్ వచ్చే రోగులకు మాత్రమే వర్తిస్తుందని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇది వర్తించదని స్పష్టం చేశారు. నేను మానసికంగా బీజేపీ (BJP) సిద్ధాంతాలను బలంగా నమ్ముతానని ఆ పార్టీకి నా మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో ఎలాంటి అనైతికత లేదు. ఇది కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన చొరవ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.

డాక్టర్ పీకే హజ్రా ప్రకటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది డాక్టర్ నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే మరికొంత మంది విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరడానికి లేదా మద్దతు ఇవ్వడానికి హక్కు ఉన్నప్పటికీ ఒక రోగి మతం, రాజకీయ అనుబంధం ఆధారంగా వారి కన్సల్టేషన్ ఫీజులో వివక్ష చూపడం వైద్య నైతిక విలువలకు, వృత్తిపరమైన ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే హజ్రా వ్యాఖ్యలను సమర్ధిస్తున్న వారు ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో నిందితులు ఓ వర్గానికి చెందిన వారు డాక్టర్లేనంటూ గుర్తు చేస్తున్నారు. మొత్తంగా డాక్టర్ హజ్రా ప్రకటించిన డిస్కౌంట్ బెంగాల్ ఎన్నికల వేళ సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే హజ్రా చేసిన ప్రకటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెంగాల్ తీవ్రంగా తప్పు పట్టినట్లు పలు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

నెటిజన్ల స్పందన: మద్దతు, విమర్శలు

వైద్య సంఘం ఆగ్రహం

డాక్టర్ హజ్రా ప్రకటన బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన చర్యను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం వైద్య నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.