|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వస్త్రధారణ వివాదం: అనసూయకు నాగబాబు అండపై జనసేనలో సస్పెన్షన్ రచ్చ!

Published: 27-12-2025, 7:32 AM
వస్త్రధారణ వివాదం: అనసూయకు నాగబాబు అండపై జనసేనలో సస్పెన్షన్ రచ్చ!
  • నటుడు శివాజీ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.
  • యాంకర్ అనసూయ శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి, ఎదురుదాడి చేశారు.
  • జనసేన నేత నాగబాబు అనసూయకు మద్దతు తెలుపుతూ, శివాజీపై విమర్శలు చేశారు.
  • నాగబాబును జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రస్తుతం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

నటుడు శివాజీ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అనసూయ వాటిని ఖండించగా, ఈ వివాదంలో జనసేన నేత నాగబాబు ఆమెకు మద్దతు పలికారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో, నాగబాబును జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.

వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యలు, అనసూయ ఆగ్రహం

దండోరా సినిమా ఫంక్షన్‌లో స్త్రీల వస్త్రాధారణపై నటుడు శివాజీ(Shivaji) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ఇటీవల ప్రముఖ యాంకర్ అనసూయ(Anasuya) స్పందిస్తూ.. శివాజీపై రెచ్చిపోయారు. దీన్నే అతి తెలివి అంటారు. ఒక్క మాటలతో చెప్పాలంటే, చేతగానితనంతో మాట్లాడుతున్నారు. అదేమంటే ఫేక్‌ ఫెమినిస్ట్‌లని మాపై ముద్రవేస్తారు. అసలు ఫెమినిజం అనేది లేదు. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉండాలి. స్త్రీ, పురుషులు ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఈ కాలంలో కూడా దుస్తుల గురించి మాట్లాడటం చేతగానితనం. స్వీయ నియంత్రణ లేని వాళ్లు, అభద్రతాభావంతో బతికే వాళ్లు మాత్రమే ఎదుటి వాళ్లపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు అని ఓ రేంజ్‌లో శివాజీపై అనసూయ రెచ్చిపోయారు. ఆ తర్వాత శివాజీ కూడా అనసూయకు కౌంటర్ ఇచ్చారు.

అయితే.. ఈ వ్యవహారంపై తాజాగా జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu ) స్పందించారు. అనసూయకు మద్దతిచ్చి.. శివాజీపై విమర్శలు చేశారు. రాజకీయ నాయకుడిగానో, ఇండస్ట్రీకి చెందిన నటుడిగానో దీనిపై స్పందించడం లేదు.. ఒక సామాన్య వ్యక్తిగా దీని గురించి మాట్లాడుతున్నాను. ఆడపిల్లలు ఎలా ఉండాలి.. వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించాలి.. ఏం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు అనే విషయాలపై ప్రతిఒక్కరూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అలా కామెంట్స్‌ చేయడం రాజ్యాంగం ప్రకారం తప్పు. ఆడవాళ్లు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలపై మహిళా సమాజం స్పందిస్తోంది. శివాజీ మాటల్లో ఎలాంటి తప్పులేదని అంటున్నారు. మంచి బట్టలు వేసుకోవాలని చెప్పడం కూడా తప్పేనా? అని మండిపడుతున్నారు. ‘‘హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మన సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడిన నాగబాబుని వెంటనే జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి.. ఇలాంటి సంగ విద్రోహ శక్తులు రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉండటానికి అనర్హులు’’ సీరియస్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనసూయకు నాగబాబు మద్దతు: కొత్త మలుపు

జనసేన నుంచి నాగబాబు సస్పెన్షన్‌కు డిమాండ్

మొత్తంగా, వస్త్రధారణపై మొదలైన ఈ వివాదం అనసూయ, నాగబాబుల ప్రమేయంతో పెద్ద చర్చకు దారితీసింది. జనసేన అధిష్టానం నాగబాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.