
📌 Key Points
- దృశ్యం 3 చిత్రం 2026 ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
- సినిమా క్లైమాక్స్ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
- జార్జి కుట్టి చివరి ప్లాన్ ఏమిటో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వస్తున్న దృశ్యం 3 చిత్రం 2026 ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దృశ్యం 3 విడుదల తేదీ ప్రకటన
Drishyam 3: సాధారణంగా మిగతా జానర్లను ఇష్టపడే ప్రేక్షకులు ఒక ఎత్తు అయితే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి ఓటు వేసే ఆడియన్స్ మరో ఎత్తు అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్లో సరికొత్త ట్రెండును ఫాలో అవడానికి సిద్ధపడే వీరికి దృశ్యం 3 ఒక ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దృశ్యం సీరీస్ ను చూడని అభిమానులు ఉండరు అనడంలో సందేహం లేదు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు చేసే పోరాటం అటు దేశవ్యాప్తంగా అందరిని కూడా ఆకట్టుకుంది. పైగా వివిధ భాషలలో ఈ సినిమా రీమేక్ అవుతూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠ భరితమైన ప్రయాణానికి ఇప్పుడు ముగింపు పలికే సమయం వచ్చేసింది.
సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) , డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వస్తున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. 2026 ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి అయితే విడుదలకు కేవలం ఒకటిన్నర నెల మాత్రమే మిగిలి వున్న నేపథ్యంలో అప్పుడే ప్రమోషన్స్ కూడా చేపట్టాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
జార్జి కుట్టి చివరి ప్లాన్ ఏమిటి?
ఇకపోతే ఈ సినిమా రెండవ భాగం ముగింపులో జార్జి కుట్టి పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి.. ఏకంగా పోలీస్ స్టేషన్ కిందనే శవాన్ని పాతి పెట్టి చాలా తెలివిగా తప్పించుకుంటాడు. మరి మూడో భాగంలో పోలీసుల ఆ శవాన్ని వెలికి తీస్తారా? జార్జి కుట్టి వేసే ఆఖరి మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో రేపుతోంది. ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ అన్ని భాషల్లోనూ అనగా తెలుగు, హిందీ, మలయాళంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని చిత్రం బృందం ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ కూడా త్వరలోనే షూటింగ్లో పాల్గొనబోతున్నారు. అటు హిందీలో ఇప్పటికే అజయ్ దేవగన్ కూడా షూటింగ్ మొదలు పెట్టేసారు. మరి ఏప్రిల్ 2వ తేదీన జార్జి కుట్టి కథకు ఒక అదిరిపోయే ముగింపు లభించడం ఖాయం అనేది చెప్పాలి. మొత్తానికి అయితే మోహన్ లాల్ ఒక అద్భుతమైన చిత్రంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు.
మూడు భాషల్లో క్లైమాక్స్ విడుదల
మోహన్ లాల్ విషయానికి వస్తే.. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఒకవైపు హీరోగా.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మోహన్ లాల్ 2025 నాటికి మొత్తం ఆరు జాతీయ అవార్డులను అందుకున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డుల విభాగంలో నాలుగు విభాగాల్లో అవార్డు లభించింది. అలాగే పద్మశ్రీ, పద్మ భూషణ్ , దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా అందుకున్నారు. ఇక అలా విలక్షణమైన నటనతో జ్యూరీ మెంబర్స్ ను కూడా మెప్పిస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.
దృశ్యం 3 చిత్రం ఏప్రిల్ 2, 2026న విడుదల కానుంది. జార్జి కుట్టి ఈసారి ఎలాంటి ప్లాన్‌తో వస్తాడో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది.


