|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మూడు భాష‌ల్లోను ఒకే క‌థ‌తో, ఒకే రోజు రానున్న ‘దృశ్యం 3’.. సిద్ధంగా ఉండండి అంటూ హైప్ పెంచుతున్న పోస్ట్..

Published: 24-06-2025, 3:29 AM
మూడు భాష‌ల్లోను ఒకే క‌థ‌తో, ఒకే రోజు రానున్న ‘దృశ్యం 3’.. సిద్ధంగా ఉండండి అంటూ హైప్ పెంచుతున్న పోస్ట్..

సుపర్ హిట్ దృశ్యం సినిమా ఫ్రాంచైజీకి మరో కొత్త అధ్యాయం దృశ్యం 3. మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకే కథతో ఒకే రోజు విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

దృశ్యం 3 విడుదల తేదీ

మ‌ల‌యాళ సూపర్ హిట్ చిత్రం ‘దృశ్యం’(Drishyam) ఫ్రాంచైజీకి ఉన్నఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తొలుతు మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన ఈ సినిమాని ఆ త‌ర్వాత తెలుగు, హిందీ భాష‌ల‌లో రీమేక్ చేశారు. ఆ రెండు భాగాలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇటీవలె ‘దృశ్యం 3’ సిద్ధమవుతోందని ప్రకటించారు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌(Jeethu Joseph). అక్టోబర్​లో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే, జీతూ జోసెఫ్‌ కథతో సంబంధం లేకుండా హిందీ వెర్షన్‌లో దృశ్యం 3 సినిమా రూపొందుతుంద‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌క‌టించ‌డంతో అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగాయి.

ఒకే కథ, మూడు భాషలు

మలయాళం, హిందీలో వేర్వేరు కథలతో దృశ్యం 3 వస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. సస్పెన్స్ తిరిగి వచ్చింది… ఈసారి, అది ఎప్పుడూ లేనంత పెద్దది.. దర్శకుడు జీతు జోసెఫ్ #దృశ్యం3 స్క్రిప్ట్‌ను దాదాపుగా పూర్తి చేశాడు. అయితే ద‌ర్శ‌కుడు మలయాళంలో రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో దృశ్యం-3 వస్తుంది. కాకపోతే మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరపడం కుదరకపోవచ్చు.

నటీనటులు మరియు దర్శకుడు

ఎందుకంటే స్టార్స్ కాల్షీట్స్ వ‌ల‌న ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుకే వారి అనుకూల‌త‌ని బ‌ట్టి షూట్ చేస్తారు. కానీ చిత్రాన్ని మూడు భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి – ఈ ఐకానిక్ థ్రిల్లర్ విశ్వంలోని తదుపరి అధ్యాయానికి సిద్ధంగా ఉండండి’ అనే రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా దృశ్యం తొలి రెండు భాగాల్లో మలయాళ వెర్షన్‌లో కథానాయకుడిగా మోహన్‌లాల్‌(Mohanlal), తెలుగులో వెంకటేశ్‌(Venkatesh), హిందీలో అజయ్‌ దేవగణ్‌(Ajay Devgan) నటించిన సంగతి తెలిసిందే.

దృశ్యం 3 సినిమా మూడు భాషల్లో ఒకే రోజు విడుదల కానున్న విషయం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.