
📌 Key Points
- ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో అర్ధరాత్రి దారుణం.
- పెట్రోల్ బంక్ సిబ్బంది నిద్రమత్తులో ఉండగా చోరీ.
- డబ్బులు అడగడంతో బంక్ చుట్టూ తిరిగి పారిపోయిన డ్రైవర్.
- నెటిజన్ల విభిన్న కామెంట్లు, నిందితుడిపై కేసు పెట్టాలని డిమాండ్.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో ఒక కారు డ్రైవర్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ నింపుకుని డబ్బులు చెల్లించకుండా పారిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఫిరోజాబాద్‌లో అర్ధరాత్రి దొంగతనం
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. ఇక మరికొన్ని వీడియోలు అయితే చాలా వింతగా, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ గా ఒక కారు వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత, డబ్బులు ఇవ్వకుండా కార్లో ఓ డ్రైవర్ పారిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ( Firozabad) అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 7వ తేదీన రాత్రి సమయం చూసుకొని ఓ కారు డ్రైవర్ స్కెచ్ వేశాడు. తన దగ్గర డబ్బులు లేకున్నా, కారులో ఫుల్ ట్యాంక్ కొట్టించాడు. ఆ తర్వాత నిద్ర మత్తులో ఉన్న బంక్ వర్కర్లు డబ్బులు అడిగారు. దీంతో చాలా తెలివిగా ప్రవర్తించిన కారు డ్రైవర్, బంకులో మూడు రౌండ్లు కొట్టాడు. ఆ తర్వాత రోడ్డెక్కి జంప్ అయ్యాడు.
నిద్రమత్తులో సిబ్బంది, డ్రైవర్ పారిపోవడం
ఇక కారు వేగంగా దూసుకు వెళ్లిన నేపథ్యంలో బంకు వర్కర్లు ఏమీ చేయలేక, నోరెళ్లబెట్టారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్, రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పెట్రోల్ ఇలా కూడా పోయించుకుంటారా? డబ్బులు లేనప్పుడు ఈ ఐడియా ఫాలో అయితే సరిపోతుందని దారుణంగా ఆడుకుంటున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన కారు డ్రైవర్ పై కేసు పెట్టాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు.
వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన
A post shared by Kalaburagi times (@kalaburagi_timess)
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి మోసాలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.


