|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dude Movie Video Song: ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. ఎమోషనల్ సాంగ్ ఫుల్‌ వీడియో!

Published: 06-11-2025, 11:58 AM
Dude Movie Video Song: ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. ఎమోషనల్ సాంగ్ ఫుల్‌ వీడియో!

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్యూడ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి హ్యాట్రిక్ కొట్టింది. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ నుంచి యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘బాగుండు పో..’ ఎమోషనల్ వీడియో సాంగ్ విడుదలైంది.

Key Points

1

ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సూపర్ హిట్ అయింది.

2

ఈ చిత్రం నుంచి తాజాగా 'బాగుండు పో..' అంటూ సాగే ఎమోషనల్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది.

4

కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ విజయం

లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇటీవలే ‘డ్యూడ్’ మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. బాగుండు పో..  అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సాంగ్‌ యూత్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ ఎమోషనల్ లవ్ సాంగ్‌కు రాజజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజీత్ హెగ్డే, సాయి ‍అభ్యంకర్ ఆలపించారు. ఈ పాటను సాయి అభ్యంకర్ కంపోజ్ చేశారు. కాగా.. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

‘బాగుండు పో..’ పాట విశేషాలు

డ్యూడ్ సినిమా బృందం & నిర్మాణం

‘డ్యూడ్’ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ సాధించిన హ్యాట్రిక్ విజయాన్ని ఈ కొత్త ఎమోషనల్ వీడియో సాంగ్ మరింత పెంచుతోంది. యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ఈ పాట, సినిమా విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.