|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dulquer Salmaan: ఫ్యామిలీ ఫొటో పంచుకుంటూ కుమార్తెకు అద్భుతంగా విష్ చేసిన అమ్మాయిల ఫేవరెట్ హీరో

Published: 06-05-2025, 12:44 AM
Dulquer Salmaan: ఫ్యామిలీ ఫొటో పంచుకుంటూ కుమార్తెకు అద్భుతంగా విష్ చేసిన అమ్మాయిల ఫేవరెట్ హీరో

మలయాళ సినిమాల్లో తన నటనతో మెప్పించిన దుల్కర్ సల్మాన్, తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. తాజాగా తన కుమార్తె మరియమ్ అమీరా పుట్టినరోజును ఫ్యామిలీ ఫోటోతో జరుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

Key Points

1

దుల్కర్ సల్మాన్ కుమార్తె మరియమ్ అమీరా పుట్టినరోజు వేడుకలు.

2

ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

4

పవన్ సాధినేని దర్శకత్వంలో త్వరలోనే కొత్త సినిమా ప్రారంభం కానుంది.

మరియమ్ అమీరా పుట్టినరోజు వేడుకలు

మయాళ మెగాస్టార్ ముమ్మట్టి నటవారసుడి సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు నటుడు దుల్కర్ సల్మాన్. తన ఓన్ టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్నాడు. మొదట్లో మలయాళ సినిమాల్లో నటించి.. ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో తర్వాత టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఇక్కడ కూడా జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడం విశేషం అని చెప్పుకోవచ్చు.

పైగా ముఖ్యంగా ఇటీవల తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. సీతారామం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత లక్కీ భాస్కర్‌ అనే మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సెప్టెంబరు 7 వ తారీకున విడుదలైన ఈ మూవీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో బ్యానర్‌లో రూపొందింది.

దుల్కర్ సల్మాన్ సినిమా కెరీర్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ పవన్ సాధినేని డైరెక్షన్‌లో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే సినిమాల విషయం పక్కన పెడితే.. అయితే నిన్న (మే 5న) దుల్కర్ సల్మాన్ కుమార్తె మరియమ్ అమీరా సల్మాన్ పుట్టినరోజు.

దుల్కర్ సల్మాన్ తన భార్య అమల్ సుఫియాకు మే 5, 2017 న కుమార్తె మరియమ్ అమీరా సల్మాన్ జన్మించింది. దుల్కర్ సల్మాన్ తన కుమార్తె పుట్టినరోజును ప్రతి సంవత్సరం మే 5 న గ్రాండ్‌గా జరుపుకుంటాడు.ఇక 22 డిసెంబర్ 2011న, సల్మాన్ ఆర్కిటెక్ట్ అమల్ సుఫియాను వివాహం చేసుకున్నాడు. అమల్ చెన్నైలో స్థిరపడిన ఉత్తర భారత ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది.

ఫ్యామిలీ ఫోటో మరియు సోషల్ మీడియా పోస్ట్

అమల్ అండ్ దుల్కర్ ఒకే పాఠశాలలో చదివారని, అమల్ దుల్కర్ కంటే ఐదేళ్లు జూనియర్ అని దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా ఈ హీరో సోషల్ మీడియా వేదికన ఫ్యామిలీ ఫొటో పంచుకుంటూ ‘మా యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు!! మీ కోసం ప్రతిరోజు దేవదూత మేరీకి ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు.

దుల్కర్ సల్మాన్ కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతూ, తన సినిమా కెరీర్ లో కూడా సక్సెస్ గా దూసుకుపోతున్నాడు. భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.