|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Divvela Madhuri : దువ్వాడ – దివ్వెల భలే ఛాన్స్ కొట్టేసారుగా.. ఆ హీరో సినిమాలో నటించిన జంట.. రేపే రిలీజ్..

Published: 19-11-2025, 10:59 PM
Divvela Madhuri : దువ్వాడ – దివ్వెల భలే ఛాన్స్ కొట్టేసారుగా.. ఆ హీరో సినిమాలో నటించిన జంట.. రేపే రిలీజ్..

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట ఇప్పుడు వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ‘ప్రేమంటే’ సినిమాలో ఈ జంట కనిపించనుండగా, ఈ చిత్రం రేపు విడుదల కానుంది.

Key Points

1

దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి సోషల్ మీడియాలో బాగా పాపులర్.

2

దివ్వెల మాధురి గతంలో బిగ్ బాస్ కు కూడా వెళ్ళొచ్చింది.

4

ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది.

సోషల్ మీడియా స్టార్ జంట సినీ అరంగేట్రం

Divvela Madhuri : దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇప్పుడు ఫాలోయింగ్ కూడా బాగుంది. దివ్వెల మాధురి అయితే బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చింది. మాధురి బిగ్ బాస్ కి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ బయట ఉండి ప్రమోషన్స్ చేసి ఫుల్ సపోర్ట్ చేసారు. ఈ జంట రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వార్తల్లో నిలుస్తుంది.(Divvela Madhuri)

తాజగా దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట మరోసారి చర్చల్లో నిలిచింది. వీళ్ళిద్దరూ ఓ సినిమాలో కనిపించబోతున్నారు. ఆల్రెడీ గతంలో వాలంటీర్ అనే ఓ చిన్న సినిమాలో కనిపించారు. ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రియదర్శి, ఆనంది జంటగా తెరకెక్కిన ప్రేమంటే సినిమా నవంబర్ 21న రిలీజ్ కానుంది. యాంకర్ సుమ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.

‘ప్రేమంటే’ సినిమాలో దువ్వాడ – దివ్వెల

వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి?

అయితే ఈ సినిమాలో దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి కూడా నటించారట . ఓ చిన్న క్యామియో రోల్ లో ఈ ఇద్దరూ కనిపించనున్నారట. మరి సినిమాలో వీళ్ళు ఎలా నటించారో, ఏ పాత్రల్లో కనిపించారో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే. ఇది కనక కొంచెం క్లిక్ అయినా ఈ ఇద్దరికీ మున్ముందు మరిన్ని సినిమా ఆఫర్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. దువ్వాడ – దివ్వెల ఫాలోవర్స్ మాత్రం ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దువ్వాడ – దివ్వెల జంట సినీ ప్రయాణం ఈ చిన్న పాత్రతో మొదలై, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని వారి అభిమానులు ఆశిస్తున్నారు. రేపు సినిమా విడుదలయ్యాక వారి పాత్రలపై స్పష్టత వస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.