|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ED Raids : స్టార్ హీరోల ఇళ్లల్లో ఈడీ సోదాలు.. లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారని..?

Published: 23-09-2025, 5:19 AM
ED Raids : స్టార్ హీరోల ఇళ్లల్లో ఈడీ సోదాలు.. లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారని..?

భూటాన్ నుంచి అక్రమంగా లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నారనే అనుమానంతో మలయాళ సూపర్ స్టార్లు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.

Key Points

1

మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇళ్లలో ఈడీ సోదాలు.

2

భూటాన్ నుంచి అక్రమంగా లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నారనే అనుమానం.

4

ఇంకా చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు ఈ కేసులో ఉన్నాయని తెలుస్తుంది.

ఈడీ సోదాల వెనుక కారణం

ED Raids : ఇటీవల భూటాన్‌ లో కొన్ని ఖరీదైన వాహనాలను వేలం వేస్తే వాటిని తక్కువ ధరకు కొనుక్కొని కొంతమంది అక్రమంగా ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్‌ చేశారట. ఈ ఖరీదైన కార్లను ఇండియాలోని సినిమా, బిజినెస్ ప్రముఖులకు అమ్మారన్న సమాచారం రావడంతో దేశ వ్యాప్తంగా దాదాపు 30 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేసారు.(ED Raids)

ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, దుల్కర్‌ సల్మాన్‌ నివాసాల్లో నేడు ఉదయం కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆపరేషన్‌ నమకూర్‌ పేరుతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కొచ్చి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇళ్లతో పాటు, పనంపిల్లి నగర్‌లోని ఉన్న దుల్కర్‌ ఇంట్లో సోదాలు చేశారు. అయితే వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి వాహనాలు లేవని సమాచారం.

పృథ్వీరాజ్, దుల్కర్ ఇళ్లలో సోదాలు

ఇతర సినీ ప్రముఖులపై దర్యాప్తు

అంతే కాకుండా ఈ కేసులో ఇంకా చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వారి ఇళ్లపై కూడా సోదాలు నిర్వహిస్తారని తెలుస్తుంది. గతంలో దుల్కర్ ఓ ఇంటర్వ్యూలో తనకు కార్లంటే ఇష్టమని, లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయని, తన ఇంట్లోనే కాకుండా హైదరాబాద్ లో కూడా కార్లు దాస్తానని చెప్పుకొచ్చాడు.

ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇతర సినీ ప్రముఖుల పాత్ర కూడా దర్యాప్తులో ఉంది. ఈడీ సోదాల ప్రభావం సినీ పరిశ్రమపై ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.