
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు, ఈడీ తీవ్రంగా విచారణ చేస్తున్నాయి. రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ వంటి టాలీవుడ్ నటులకు ఈడీ నోటీసులు పంపింది. వీరందరూ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Key Points
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం.
రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండలకు నోటీసులు.
విచారణ తేదీలు: రానా (జూలై 23), ప్రకాష్ రాజ్ (జూలై 30), మంచు లక్ష్మి (ఆగస్టు 13), విజయ్ దేవరకొండ (ఆగస్టు 6).
సెలబ్రిటీలు ఈడీ విచారణకు హాజరవుతారా అన్నది సస్పెన్స్.
ఈడీ విచారణకు హాజరు కావాల్సిన నటులు
Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ని పోలీసులు, ఈడీ సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినిమా సెలబ్రిటీలతో పటు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేస్తూ విచారిస్తున్న సంగతి తెలిసిందే.
బెట్టింగ్ యాప్ కేసులో రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. వీరంతా గతంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రచారం చేసారు. తాజాగా ఈ సెలబ్రెటీలకు విచారణకు రమ్మని ఈడీ నోటీసులు ఇచ్చారు.
విచారణకు హాజరు కావాల్సిన తేదీలు
బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌పై విచారణ
రానా జూలై 23న విచారణకు రావాలని, ప్రకాష్ రాజ్ జూలై 30న విచారణకు రావాలని, మంచు లక్ష్మి ఆగస్ట్ 13న, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపించింది. మరి వీరంతా ఈడీ విచారణకు హాజరవుతారా చూడాలి.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కీలక మలుపు తిరిగింది. నటుల సహకారం ఎలా ఉంటుందో చూడాలి. ఈ కేసు తదుపరి పరిణామాలను వేచి చూడాలి.


