
📌 Key Points
- అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా హెబ్బా పటేల్ ‘ఈషా’ చిత్రంలో నటిస్తున్నారు.
- శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.
- హారర్ సినిమాల్లో తొలిసారిగా ప్రత్యేక ‘వార్నింగ్ వీడియో’ను చిత్రబృందం విడుదల చేసింది.
- వీడియోలో ‘ఆత్మంటే అదేనేమో’ అనే డైలాగ్ ప్రేక్షకులను భయాందోళనలకు గురిచేస్తోంది.
హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఈషా’ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘వార్నింగ్ వీడియో’ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రేక్షకులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తూ, వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
‘ఈషా’ మూవీ విశేషాలు: నటీనటులు, విడుదల తేదీ
ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.అలాగే ఇందులో సిరి హనుమంత్. పృథ్వీ రాజ్ వంటి తదితరులు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్ టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్స్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టాయి.
హారర్ జానర్‌లో తొలిసారి ‘వార్నింగ్ వీడియో’
అయితే డిసెంబర్ 25న విడుదల కానున్నది. ఇక వీడియో కంటెంట్ తోనే ఇంత భయపెడుతున్న ‘ఈషా’.. వెండితెరపై ఇంకెలా ఉంటుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి మేకర్స్ ‘వార్నింగ్ వీడియో’ పేరిట ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు.
వెన్నులో వణుకు పుట్టిస్తున్న వైరల్ వీడియో
సాధారణంగా హారర్ సినిమాలకు ట్రైలర్లు రావడం సహజం, కానీ ఇలా ప్రత్యేకంగా హెచ్చరిక వీడియో రావడం హారర్ జానర్‌లోనే ఇదే తొలిసారి. ఇక వార్నింగ్ వీడియోలో అతి భయంకర సన్నివేశాలు రిలీజ్ చేశారు. 50 సెకన్లు నిడివి గల ఈ వీడియోలో చివరగా ఆత్మంటే అదేనేమో అనే చెప్పే డైలాగ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్నింగ్ వీడియోనెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ‘వార్నింగ్ వీడియో’తోనే ‘ఈషా’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. హారర్ ప్రియులు డిసెంబర్ 25న థియేటర్లలో ఈ సినిమా ఇంకెలా భయపెడుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


