|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌బాస్ 9 ఫినాలేకు ప్రభాస్: ఆ ఒక్క వార్తతో ఫ్యాన్స్‌లో పండుగ వాతావరణం!

Published: 19-12-2025, 4:44 AM
బిగ్‌బాస్ 9 ఫినాలేకు ప్రభాస్: ఆ ఒక్క వార్తతో ఫ్యాన్స్‌లో పండుగ వాతావరణం!
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది, ఉత్కంఠగా సాగుతోంది.
  • ప్రస్తుతం తనూజ, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్, సంజన టాప్-5 కంటెస్టెంట్లుగా ఉన్నారు.
  • పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బిగ్‌బాస్ 9 ఫినాలేకు గెస్ట్‌గా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
  • ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఫినాలేకు వస్తున్నారని ఊహాగానాలున్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఫినాలేకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా రాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. ‘రాజా సాబ్’ ప్రమోషన్స్‌లో భాగంగానే ప్రభాస్ వస్తున్నారని తెలుస్తుండగా, ఈ వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో మునిగిపోయారు.

బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలే: టాప్-5 కంటెస్టెంట్లు వీరే!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss-9) ఎట్టకేలకు గ్రాండ్ ఫైనల్‌కు వచ్చేసింది. దాదాపు 15 వారాల సుదీర్ఘ ప్రయాణంలో గొడవలు, భావోద్వేగాలు, టాస్క్‌లతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం హౌస్‌లో తనూజ, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ఇమ్మానుయేల్, సంజన టాప్-5 కంటెస్టెంట్లుగా నిలిచారు. ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో ఓటింగ్ రేసు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్‌ 9 విజేత ఎవరు? చివరి వారం ఓటింగ్ ఎలా సాగుతోంది? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ప్రభాస్ రాక వెనుక అసలు కారణం ఇదేనా?

ప్రస్తుతం బిగ్‌బాస్ ఆ ఫైవ్ కంటెస్టెంట్‌ల జర్నీ వీడియోలు చూపిస్తూ హౌస్‌మేట్స్‌ను భావోద్వేగానికి గురిచేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ, డెమోన్ పవన్ తమ జర్నీలను చూసుకున్నారు. ఇక ఈ రోజు ఏపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ పడాల, సంజన జర్నీను చూపించనున్నారు. ఇదిలా ఉంటే.. ప్రతి సీజన్‌కు ఓ బిగ్ సెలబ్రెటీని పిలిచి విన్నర్‌ను అనౌన్స్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాగా ఈసారి కూడా బిగ్ సెలబ్రిటీ బిగ్ బాస్ ఫైనల్‌కు గెస్ట్‌గా రానున్నాడని తెలుస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు!

అతను మరెవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas). అతన్ని సీజన్ 9 ఫినాలేకు గెస్ట్‌గా పిలవాలని టీమ్ నిర్ణయించారట. అయితే జనవరి 9న రాజా సాబ్ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగానే ప్రభాస్‌ను బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్‌గా పిలిచారని తెలుస్తుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మొత్తానికి బిగ్‌బాస్ 9 ఫినాలేకు ప్రభాస్ రాబోతున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఊహాగానాలు నిజమైతే, ఈ సీజన్ ఫినాలే మరింత భారీగా మారడం ఖాయం. అధికారిక ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.