|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2026లో ఇండియన్ బాక్సాఫీస్ దద్దరిల్లేలా భారీ సినిమాలు! గెలుపు గుర్రమెవరిదో?

Published: 13-01-2026, 7:00 AM
2026లో ఇండియన్ బాక్సాఫీస్ దద్దరిల్లేలా భారీ సినిమాలు! గెలుపు గుర్రమెవరిదో?
  • 2026లో భారీ బడ్జెట్ సినిమాలతో ఇండియన్ సినిమా రూపురేఖలు మారనున్నాయి.
  • ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
  • రజినీకాంత్ జైలర్ 2 చిత్రం మొదటి భాగం విజయం సాధించడంతో రిస్క్ ఉన్నా అంచనాలు ఎక్కువయ్యాయి.
  • యాష్ హీరోగా వస్తున్న టాక్సిక్ చిత్రం మాస్ ఆడియన్స్‌ను మాత్రమే టార్గెట్ చేసేలా ఉంది.

2026లో ఇండియన్ సినిమా పరిశ్రమలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా హాట్ టాపిక్‌గా మారింది.

2026లో మారనున్న ఇండియన్ సినిమా ముఖచిత్రం

2026 Big Budget Movies: 2026లో ఇండియన్ సినిమా రంగం పూర్తిగా మారబోతోంది. భారీ బడ్జెట్‌లు, రిస్కీ కథలు, కొత్త ట్రీట్మెంట్‌తో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ఏడాది మార్కెటింగ్ కూడా చాలా షాకింగ్‌గా ఉండబోతోంది. స్టార్ హీరోలు, టాప్ దర్శకులు కలిసి అత్యంత హై రిస్క్ ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నారు.

ముఖ్యంగా స్పిరిట్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఇది రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్, యూత్ ఎలిమెంట్స్ అన్నీ కలిపిన కొత్త తరహా సినిమా అని తెలుస్తోంది. పోలీస్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తూ, చాలా ఇంటెన్స్ సీన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనుందంట. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా హిట్ అయితే ఇండస్ట్రీకి మరో స్థాయి తీసుకెళ్తుంది..ఫ్లాప్ అయితే భారీ నష్టమే. ముఖ్యంగా సందీప్ రెడ్డి లాంటి బోల్డ్ దర్శకుడితో .. ఎక్స్పరిమెంట్లకి కొంచెం దూరంగా ఉందే ప్రభాస్ చెయ్యి కలపడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోపక్క ఇదొక రకంగా భారీ రిస్క్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పవచ్చు.

ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాతో భారీ అంచనాలు

ఇంకో వైపు రజినీకాంత్ హీరోగా వస్తుందని జైలర్ 2 కూడా చాలా రిస్కీ ప్రాజెక్ట్. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమాకి ఇప్పటికే బడ్జెట్ అనుకున్న దానికన్నా రెండింతలు ఎక్కువైందంట. మరి ఎన్ని అంచనాలు మధ్య వస్తున్న ఈ సినిమా ఫ్లాప్ అయితే భారీ నష్టాలు కూడా తప్పవు.

ఇక మరో భారీ రిస్క్ ప్రాజెక్ట్ ఏమిటి అంటే యాష్ హీరోగా వస్తున్న టాక్సిక్. ఈ సినిమా టీజర్ చూస్తేనే ఫ్యామిలీ ఆడియన్స్ ఆమడ దూరం పరిగెత్తేలా ఉంది. కానీ ఈ చిత్రం బడ్జెట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో ఫ్యామిలీ ఆడియన్ థియేటర్ కి రాకుండా.‌. కేవలం మాస్ ఆడియన్స్ ని మాత్రమే నమ్ముకొని ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

రిస్క్ ఉన్నా.. రజినీకాంత్ ‘జైలర్ 2’ పై భారీ హోప్స్

మరో పక్క బాలీవుడ్ లో కూడా అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు భారీ యాక్షన్ సినిమాలతో రానన్నారు. మొత్తానికి 2026 ఇండియన్ బాక్సాఫీస్‌కు . భారీ బడ్జెట్, భారీ అంచనాలు, భారీ రిస్క్.. ప్రాజెక్టులను చవిచూపించబోతోంది. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా చరిత్ర సృష్టించడం ఖాయం అలానే ఫ్లాప్ అయితే విపత్తు తీసుకురావడం కూడా కాయం. అయినా నిర్మాతలు, దర్శకులు వెనకడుగు వేయడం లేదు. అదే 2026 సినిమా స్పెషాలిటీ.

మొత్తానికి 2026లో విడుదల కాబోయే ఈ భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి. వీటిలో ఏ ఒక్క సినిమా హిట్టయినా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.