|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వేడుకలో ఈషా రెబ్బా సందడి! తరుణ్ భాస్కర్‌తో కలిసి చిల్ అవుట్!

Published: 28-02-2026, 8:35 AM
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వేడుకలో ఈషా రెబ్బా సందడి! తరుణ్ భాస్కర్‌తో కలిసి చిల్ అవుట్!
  • విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ఈషా రెబ్బా.
  • ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ కలిసి హల్దీ వేడుకల్లో పాల్గొన్నారు.
  • ఈషా, తరుణ్ భాస్కర్ గతంలో ‘ఓం శాంతి శాంతిహి’ సినిమాలో కలిసి నటించారు.
  • త్వరలోనే ఈషా, తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

నటి ఈషా రెబ్బా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వేడుకలో ఆమె దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో కలిసి కనిపించడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

విజయ్, రష్మిక పెళ్లిలో ఈషా రెబ్బా సందడి

Virosh Wedding Pics: నటి ఈషా రెబ్బ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ అభిమానుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. ఆ ఫొటోలు విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్నల పెళ్లి వేడుకల సందర్భంగా తీసినవిగా కావడం విశేషం. ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ పెళ్లి వేడుకలు.. చూసుకుని నిన్ననే మీరిద్దరూ హైదరాబాదుకి తిరిగి వచ్చేసారు.

ఈషా ఇంస్టాగ్రా షేర్ చేసిన ఫొటోల్లో.. ఈషా రెబ్బ తన స్నేహితులతో కలిసి చిరునవ్వులతో కనిపించింది. అందరూ ఈ వేడుకలో ఎంజాయ్ చేసినట్టు ఆ ఫోటోలు ఉన్నాయి. అంతేకాకుండా తరుణ్ భాస్కర్ తో కలిసి ఇషా హల్దీ వేడుకల్లో ఎంజాయ్ చేస్తూ.. కనిపించింది. మరో ఫొటోలో విజయ్, రష్మిక ఇద్దరూ నవ్వుతూ కనిపించగా.. ఆ క్షణాన్ని ఈషా అభిమానులతో పంచుకుంది. ఆమె క్యాప్షన్‌గా “చాలా అందమైన పెళ్లి. ఎంతో ప్రేమ, ఎన్నో జ్ఞాపకాలు” అని రాసింది.

ఈ పోస్ట్‌లో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈషా రెబ్బ దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో కలిసి కనిపించడం. ఈ ఇద్దరూ ఒకే పెళ్లి వేడుకకు హాజరయ్యారని తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. వీరిద్దరూ ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. కానీ ఇలాంటి వ్యక్తిగత వేడుకలో ఇద్దరూ కలిసి ఉండడం మరింత ఆసక్తిని పెంచింది.

తరుణ్ భాస్కర్‌తో కలిసి ఎంజాయ్ చేసిన ఈషా

ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ ఇద్దరూ ‘ఓం శాంతి శాంతిహి’ సినిమాలో కలిసి పనిచేశారు. ఆ సినిమాలో వారి జంటకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా సహజమైన నటన, భావోద్వేగ సన్నివేశాల్లో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ సినిమా ప్రమోషన్ల సమయంలో కూడా వీరి వ్యక్తిగత జీవితం గురించి ఇద్దరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త మాత్రం గట్టిగా వినిపిస్తోంది. తమ వ్యక్తిగత విషయాలను బయటపెట్టకుండా ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడుతున్నారు. అయినా, అభిమానులు మాత్రం వారి ప్రతి పబ్లిక్ అపియరెన్స్‌ను గమనిస్తూనే ఉన్నారు.

ఈషా, తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నారా?

ఆసక్తికరంగా, విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న కూడా తమ పెళ్లికి ముందు తమ సంబంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఇదే విధంగా ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ కూడా నిశ్శబ్దంగా తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతున్నారా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

మొత్తానికి ఈషా రెబ్బా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈషా, తరుణ్ భాస్కర్ మధ్య ఏదైనా ఉందా అనేది కాలమే నిర్ణయించాలి. వారి అభిమానులు మాత్రం శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.