|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నెట్‌ఫ్లిక్స్‌కు సలార్ టీమ్ సవాల్: ఖాన్సార్‌లో ప్రభాస్ అనే డైనోసార్ ఉన్నాడు రండి!

Published: 09-03-2026, 3:05 PM
నెట్‌ఫ్లిక్స్‌కు సలార్ టీమ్ సవాల్: ఖాన్సార్‌లో ప్రభాస్ అనే డైనోసార్ ఉన్నాడు రండి!
  • ప్రభాస్ క్రేజ్‌తో సలార్ టీజర్ డైనోసార్ డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.
  • నెట్‌ఫ్లిక్స్ ‘ది డైనోసార్స్’ సిరీస్‌లో ప్రభాస్ కోసం వెతకడం ఫన్నీగా మారింది.
  • సలార్ టీమ్ నెట్‌ఫ్లిక్స్‌కు ఖాన్సార్‌లో రియల్ డైనోసార్ ఉన్నాడంటూ కౌంటర్ ఇచ్చింది.
  • సింహం, పులి, ఏనుగు కంటే డైనోసార్ డేంజర్ డైలాగ్ సలార్‌లో బాగా పాపులర్ అయింది.

ప్రభాస్ ‘సలార్’ సినిమా టీజర్ విడుదలయ్యాక, అందులోని డైనోసార్ డైలాగ్ వైరల్ అయింది. నెట్‌ఫ్లిక్స్ చేసిన ఫన్నీ ట్వీట్‌కు, సలార్ టీమ్ అంతే మాస్‌గా రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

నెట్‌ఫ్లిక్స్ ఫన్నీ ట్వీట్

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేరు. గ్లోబల్ వైడ్‌గా ఆయన పేరు మారుమోగుతోంది. ముఖ్యంగా ‘సలార్’ (Salaar) సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక, అందులో ఉన్న ‘డైనోసార్’ డైలాగ్ వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడంతా ‘సలార్’ పార్ట్ 2 (Salaar Part 2) ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా? అని వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ ఛానల్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) చేసిన ఓ పోస్ట్.. సోషల్ మీడియాలో క్రేజీ చాట్‌కు దారితీసింది. ‘సలార్’ డిజిటల్ పార్ట్‌నర్ అయిన ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా’ వేసిన ఒక ట్వీట్, దానికి ‘సలార్’ అఫీషియల్ హ్యాండిల్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అసలింతకీ ఏమా క్రేజీ ఛాట్ అనుకుంటున్నారా? విషయంలోకి వస్తే..

నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన ఎక్స్ అకౌంట్ వేదికగా.. ‘The Dinosaurs’ అనే ఒక డాక్యుమెంటరీ సిరీస్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది. అందులో ‘నేను ఈ సిరీస్ సగం వరకు చూశాను కానీ, నాకు ఇంకా ప్రభాస్ ఎక్కడా కనిపించలేదేంటి?’ అంటూ ఒక ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. అంటే డైనోసార్లు అనగానే నెట్‌ఫ్లిక్స్‌కు కూడా రెబల్ స్టార్ ప్రభాసే గుర్తొచ్చాడన్నమాట. నెట్‌ఫ్లిక్స్ వేసిన ఈ సెటైరికల్ ట్వీట్‌కు ‘సలార్’ అఫీషియల్ టీమ్ మరింత మాస్‌గా రిప్లై ఇచ్చింది. ‘రియల్ డైనోసార్‌ను చూడాలనుకుంటున్నారా? అయితే ఖాన్సార్ (Khansaar) లోకి అడుగు పెట్టండి’ అంటూ సవాల్ విసిరినట్లుగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఈ రిప్లై చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. పంచ్ అదిరింది మామా.. అంటూ ఈ పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు. దీంతో ‘సలార్’ ట్యాగ్ కాసేపు ట్రెండ్ అవడం విశేషం.

సలార్ టీమ్ అదిరిపోయే కౌంటర్

సలార్ సినిమాలో టిన్నూ ఆనంద్ చెప్పే డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ‘సింహం, పులి, ఏనుగు అన్నీ డేంజరే.. కానీ జురాసిక్ పార్కులో కాదు. ఎందుకంటే అక్కడ ఉండేది.. డైనోసార్!’ అనే డైలాగ్.. బాగా పేలింది. అప్పటి నుంచి ప్రభాస్‌ను ఫ్యాన్స్ అంతా ‘మోస్ట్ వైలెంట్ డైనోసార్’ అని సందర్భం వచ్చిన ప్రతిసారి పోల్చుతుంటారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లాంటి దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా అదే పేరుతో ప్రభాస్‌ను రిఫర్ చేయడం ఆయన గ్లోబల్ స్టార్‌డమ్‌కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ సరదా సంభాషణ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘నెట్‌ఫ్లిక్స్ మావా.. డైనోసార్ అంటే మన ప్రభాస్ అన్నే!’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన ‘సలార్ 2’ సెట్స్‌పైకి వెళ్లనున్నారు.

Want to meet the real one? Step into #Khansaar . 🦖 #Salaar #Prabhas https://t.co/dUjovvYbsv

ప్రభాస్ డైనోసార్ డైలాగ్ ట్రెండింగ్

— Salaar (@SalaarTheSaga) March 9, 2026

సలార్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, సలార్ టీమ్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే సలార్ పార్ట్ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.