|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇప్పటివరకు ఏ థ్రిల్లర్‌లో రాని డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్, ట్విస్టులు కనిపెట్టడం చాలా కష్టం: హీరో నవీన్ చంద్ర కామెంట్స్

Published: 14-05-2025, 11:00 PM
ఇప్పటివరకు ఏ థ్రిల్లర్‌లో రాని డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్, ట్విస్టులు కనిపెట్టడం చాలా కష్టం: హీరో నవీన్ చంద్ర కామెంట్స్

నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగువల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’ మే 16న విడుదలవుతోంది. తమిళంలో విడుదలైన తర్వాత అద్భుతమైన స్పందన లభించింది. సినిమా విశేషాలను నవీన్ చంద్ర వివరించారు.

Key Points

1

నవీన్ చంద్ర నటించిన 'లెవెన్' థ్రిల్లర్ సినిమా మే 16న విడుదలవుతుంది.

2

తమిళంలో విడుదలైన తర్వాత సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది.

4

ట్విస్ట్‌లు, టర్న్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా రూపొందించబడింది.

‘లెవెన్’ సినిమా విడుదల తేదీ

నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగువల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ లెవెన్ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్, విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి సినిమా విజయం తర్వాత వస్తున్న మూడో సినిమా. లెవెన్ సినిమా ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి సిద్ధంగా ఉంది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. మే 16న లెవెన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

నవీన్ చంద్ర కామెంట్స్

-అది కథ నుంచి వచ్చిన టైటిల్. సినిమా చూసినప్పుడు మీకే తెలుస్తుంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. తమిళ్‌లో షోస్ జరిగాయి. యునానిమాస్ ‌గా సూపర్ రెస్పాన్స్. చూసిన ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

-మేము అనుకున్న ట్విస్ట్‌ లు, టర్న్స్, అడ్రినల్ రష్ మూమెంట్స్ ప్రేక్షకులని ఎగ్జయిట్ చేశాయి. ఆడియన్స్ రెస్పాన్స్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ దొరికింది.

-ఇప్పటివరకూ ఏ థ్రిల్లర్‌ లో రాని ఒక డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంది. ఆడియన్స్‌కి చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. ఇందులో ట్విస్ట్ ‌ని ముందుగా డీకోడ్ (కనిపెట్టడం) చేయడం కష్టం.

సినిమా ప్రత్యేకతలు

-మంచి రైటింగ్ బలం ఉన్న సినిమా. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో సినిమా చేయడానికి దాదాపు ఆరు నెలలు సినిమా ప్రీ ప్రొడక్షన్ చేశాం. లెవన్ చూస్తున్నపుడు విజువల్‌గా ఓ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. నిర్మాతలు చాలా ఖర్చు చేశారు. ఇది డైరెక్టర్, టెక్నికల్ ఫిల్మ్.

– లోకేష్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన వారంతా డైరెక్టర్ గురించి, రైటింగ్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది.

మొత్తంగా, ‘లెవెన్’ సినిమా ప్రేక్షకులకు కొత్తరకమైన థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని నవీన్ చంద్ర తెలిపారు. సినిమాపై ఆయన చాలా ఆశాభరితంగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.