|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ఓ భామ అయ్యో రామా’ ట్రైలర్‌.. హిట్‌ కొట్టేలా సుహాస్‌

Published: 05-07-2025, 3:40 AM
'ఓ భామ అయ్యో రామా' ట్రైలర్‌.. హిట్‌ కొట్టేలా సుహాస్‌

టాలీవుడ్ నటుడు సుహాస్ మరియు మాళవిక మనోజ్ నటించిన ‘ఓ భామ అయ్యో రామా’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

'ఓ భామ అయ్యో రామా' సినిమా ట్రైలర్ విడుదలైంది.

2

సుహాస్ మరియు మాళవిక మనోజ్ ప్రధాన పాత్రధారులు.

4

జూలై 11న సినిమా విడుదల కానుంది.

ట్రైలర్ విడుదల

టాలీవుడ్‌ హీరో సుహాస్, మాళవిక మనోజ్‌ నటించిన ‘ఓ భామ అయ్యో రామా'(Oh Bhama Ayyo Rama)  సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.  ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్‌ బ్యానర్‌లో హరీశ్ నల్లా నిర్మించారు.  జూలై 11న ప్రేక్షకుల ముందుకు  రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా వచ్చిన ట్రైలర్‌ కూడా అంతే స్థాయిలో ఉంది.  కామెడీ, లవ్‌, ఎమోషనల్‌ సీన్స్‌తో ట్రైలర్‌ కట్‌ ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కాగా.. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాథ్విక్ ఆనంద్, నయని పావని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతమందిస్తున్నారు.

నటీనటులు మరియు సినిమా వివరాలు

సినిమా విడుదల తేదీ

సుహాస్ మరియు మాళవిక మనోజ్ నటించిన ‘ఓ భామ అయ్యో రామా’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ, ప్రేమ, ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా జూలై 11న విడుదల కానున్నందున అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.