
📌 Key Points
- బిగ్ బాస్ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేనన్న ఇమ్మాన్యుయేల్.
- లక్షల మంది ప్రేమ దొరికిందని ఆనందం వ్యక్తం చేసిన కమెడియన్.
- ‘నటించే మహానటులు ఇంకా పుట్టలేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు.
- బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న విషయాలను జీవితంలో పాటిస్తానని వెల్లడి.
కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తన బిగ్ బాస్ ప్రయాణంపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. లక్షల మంది ప్రేక్షకుల ప్రేమ దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తూ, బిగ్ బాస్ అనుభవాన్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని తెలిపాడు. బిగ్ బాస్ విజేత కల్యాణ్ కు శుభాకాంక్షలు చెప్పాడు.
బిగ్ బాస్ జర్నీపై ఇమ్మాన్యుయేల్ భావోద్వేగం
తన బిగ్ బాస్ ప్రయాణంపై కమెడియన్ ఇమ్మాన్యుయేల్(Emmanuel) ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తనకు బిగ్ బాస్ ఎంతో ఇచ్చాడని, లక్షల మంది ప్రేమ నాకు దొరికింది అంటూ చెప్పుకొచ్చాడు.
Emmanuel made emotional comments about his bigg boss journey
‘మహానటులు ఇంకా పుట్టలేదు’ – సంచలన కామెంట్స్
Emmanuel: తన బిగ్ బాస్ ప్రయాణంపై కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తనకు బిగ్ బాస్ ఎంతో ఇచ్చాడని, లక్షల మంది ప్రేమ నాకు దొరికింది అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ అనంతరం ఇమ్మాన్యుయేల్(Emmanuel) మీడియాతో మాట్లాడాడు.. “ఈ బిగ్ బాస్ అనుభవాన్ని నేను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని, సహ పార్టిసిపెంట్స్, మరీ ముఖ్యంగా సంజనాతో ఏర్పడిన స్పెషల్ అనుబంధం జీవితాంతం ఉంటుందని” ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.
Anasuya Bharadwaj: కసి చూపులతో కవ్విస్తున్న అనసూయ.. ఫోటోలు
బిగ్ బాస్ తర్వాత ఇమ్మాన్యుయేల్ ప్లాన్స్
బిగ్ బాస్ అంటే చాలా మంది నటన అనుకుంటారు. కానీ వారాల తరబడి, రోజుల తరబడి, గంటల తరబడి నటించే మహానటులు ఈ ప్రపంచంలో ఉండరు. ఈ బిగ్ బాస్ జర్నీలో నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా “విజనరీ వౌస్” కి నా కృతజ్ఞతలు. ఈ బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను నా కెరీర్ లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తాను. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్ కు నా శుభాకాంక్షలు. అలాగే, నాకు మొదటి స్థానం దక్కలేదన్న అసంతృప్తి ఏమాత్రం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇమ్మాన్యుయేల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇమ్మాన్యుయేల్ చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గెలుపోటములను పక్కనపెట్టి, బిగ్ బాస్ తనకు ఇచ్చిన అనుభవాన్ని, అభిమానుల ప్రేమను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పడం విశేషం.

