|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దివ్వెల మాధురితో పెట్టుకుంటే ఎలిమినేషనేనా? నోరు జారిన ఇమ్మాన్యుయెల్‌.. మొత్తం రచ్చ రచ్చ

Published: 21-10-2025, 2:44 PM
దివ్వెల మాధురితో పెట్టుకుంటే ఎలిమినేషనేనా? నోరు జారిన ఇమ్మాన్యుయెల్‌.. మొత్తం రచ్చ రచ్చ

బిగ్ బాస్ తెలుగు 9 ఏడోవారం ఎపిసోడ్‌లో నామినేషన్ల గొడవ తారాస్థాయికి చేరింది. ఇమ్మాన్యుయెల్‌, సంజనా, కళ్యాణ్‌, తనూజ మధ్య మాటల యుద్ధం, భావోద్వేగ ఘట్టాలు హైలైట్‌గా నిలిచాయి. చివరకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌తో హౌస్‌లో కొత్త రచ్చ మొదలైంది.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు 9 ఏడోవారం నామినేషన్ల రచ్చ కొనసాగింది.

2

కళ్యాణ్‌, సంజనా, తనూజ, ఇమ్మాన్యుయెల్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

4

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం హౌస్‌ను రెండు గ్యాంగ్‌లుగా విభజించారు.

ఇమ్మాన్యుయెల్‌ vs కళ్యాణ్‌: నామినేషన్ల రచ్చ

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఏడోవారం మంగళవారం ఎపిసోడ్‌లో నామినేషన్లకి సంబంధించిన చర్చ జరిగింది. కళ్యాణ్‌ తనూజని కాకుండా సంజనాని నామినేట్‌ చేసిన నేపథ్యంలో కళ్యాణ్‌పై ఫైర్‌ అయ్యాడు ఇమ్మాన్యుయెల్‌. ఇది తనూజ వరకు వెళ్లింది. ఆమె తనని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫైర్‌ అయ్యింది. ఈ గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ విషయంలోనే నువ్వు స్వీట్‌ పాయిజన్‌ అంటూ కామెంట్‌ చేసుకునే స్థాయికి వెళ్లింది. ఈ విషయంలో అటు తనూజ, ఇటు ఇమ్మాన్యుయెల్‌ రెచ్చిపోయారు.

మరోవైపు కళ్యాణ్‌ కూడా దీనిపై స్పందిస్తూ ఇమ్మాన్యుయెల్‌ చెప్పినంత మాత్రాన ఆయనదే ఎందుకు ఫాలో అవుతాను, తన స్ట్రాటజీ తనకు ఉంది కదా అని తెలిపారు. అయితే కళ్యాణ్‌ విషయంలో సంజనా నోరు జారింది. తనూజ నిఖిల్‌కి క్లోజ్‌ అవుతుందని, అతనితో వెళ్లిపోతుందని, నువ్వు ఒంటరైపోయావని కళ్యాణ్‌ని అన్నదట. ఈ విషయంలో కళ్యాణ్‌, తనూజ ఫైర్‌ అయ్యారు. సంజనాపై విరుచుకుపడ్డారు. తనకు ఇలాంటివి అంటగట్టడమేంటంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు కళ్యాణ్‌ కూడా ఫైర్‌ అయ్యాడని, సంజనాని ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. కంటెంట్‌ కోసం ఇలా చేస్తుందని ఆరోపించారు తనూజ. తాను ఒకరి విషయంలో అలా ఉండనని, అందరిని ఈక్వల్‌గానే డీల్‌ చేస్తానని తెలిపింది.

సంజనా నోరు జారడం, ఎమోషనల్ మూమెంట్

అంతేకాదు తనూజ ఒక అడుగుముందుకేసి ఆమెని ఎలిమినేట్‌ అయ్యాక కూడా తాను మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చామని, ఆ విషయంలో తాము బుద్ది తెచ్చుకోవాల్సింది అని చెప్పింది. దీంతో తనకోసం కాఫీ త్యాగం చేశావని, కానీ ఆ తర్వాత తాగావని చెప్పింది. కాసేపు హాట్‌ హాట్‌గా మాట్లాడుకున్నారు. తర్వాత కూల్‌ అయ్యారు. ఇంకోవైపు ఇమ్మాన్యుయెల్‌ విషయంలో సంజనా ఎమోషనల్‌ అయ్యింది. తనకు అతను కొడుకులాగా అని తెలిపింది. తన కొడుకుని వదిలేసి షోకి వచ్చాను, బాబుని చూసుకోలేకపోతున్నా, కానీ ఇమ్మాన్యుయెల్‌ ఓ కొడుకులా నవ్విస్తాడు, ఎంటర్టైన్‌ చేస్తాడు. దీంతో కొడుకుని అతనిలో చూసుకుంటున్నా అని తెలిపింది సంజనా. ఇది ఎమోషనల్‌గా టచ్‌ చేసింది.

అనంతరం బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లకి కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం హౌజ్‌ని రెండు గ్యాంగ్స్ గా చేశారు. ఒక గ్యాంగ్ కి సంజనా సైరెన్‌, మాస్‌ మాధురీలను చేశారు. వీళ్లు గ్యాంగ్‌లకు లీడర్లుగా ఉంటారు. వీరిద్దరు కెప్టెన్సీ కంటెండర్‌ అవుతారు. వీరు తమ టీమ్‌ సభ్యులను పెంచుకునే అవకాశం ఉంది. ఎవరి టీమ్‌లో ఎక్కువ సభ్యులు ఉంటారో వాళ్లు కెప్టెన్సీకి నేరుగా కంటెండర్‌గా మారతారని తెలిపారు. అదే సమయంలో ఏ కంటెస్టెంట్‌ వద్ద అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, వాళ్లు కంటెండర్‌కి అర్హత సాధిస్తారు. ఈ నియమం ప్రకారం హౌజ్‌ని రెండు గ్యాంగ్‌లుగా విడగొట్టాడు బిగ్ బాస్‌. తమ గ్యాంగ్లో ఉన్నదంతా దొంగలే. వాళ్లు విభిన్న వేషాధారణలో ఉన్నారు. చూడ్డానికి క్రేజ్‌గా, ఫన్నీగా ఉన్నారు. నవ్వులు పూయించడంలో సక్సెస్‌ అయ్యారు.అయితే ఇందులో ఇమ్మూ డిఫరెంట్‌ గేమ్స్ ఆడుతూ ఉన్నారు.

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్: రెండు గ్యాంగ్‌లు

ఈ క్రమంలో ఆయన మధురీపై షాకింగ్‌ కామెంట్లు చేశారు. సంజనా వైపు ఉండాల్సిన ఇమ్మాన్యుయెల్‌ కాసేపు మాధురీ వైపు తిరిగాడు. ఈ క్రమంలో ఆమె గొప్ప అంటూ నినాదాలు చేశారు. నోరు జారి మాధురీ అమరహే అంటూ కామెంట్‌ చేశాడు. వెంటనే దాన్ని సరి చేసుకున్నాడు. మరోవైపు సోమవారం ఉంటుంది నామినేషన్‌, మా అక్కతో పెట్టుకుంటే అయిపోతారు ఎలిమినేషన్‌ అంటూ కామెంట్‌ చేయడం హైలైట్‌గా నిలించింది. మాధురి టార్గెట్‌ చేసే వాళ్లు ఎలిమినేట్‌ అవుతారని తెలిపారు ఇమ్ము. ఇదే ఇప్పుడు రచ్చ రచ్చ అవుతుంది.

నామినేషన్లతో ప్రారంభమైన గొడవలు కెప్టెన్సీ టాస్క్‌తో మరింత రసవత్తరంగా మారాయి. ఇమ్మాన్యుయెల్‌ నోరు జారడం, సంజనా భావోద్వేగం ఈ వారం ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాబోయే ఎపిసోడ్‌లలో ఇంకెన్ని మలుపులు చూడాల్సి వస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.