|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

90ల నాటి మధురాలు మళ్ళీ! ‘ఎపిక్’ నుంచి ‘సంచారమే’ సాంగ్ రిలీజ్.. ఒక ఊహించని ప్రయాణం!

Published: 09-03-2026, 11:35 AM
90ల నాటి మధురాలు మళ్ళీ! 'ఎపిక్' నుంచి 'సంచారమే' సాంగ్ రిలీజ్.. ఒక ఊహించని ప్రయాణం!
  • 90స్ వెబ్ సిరీస్ సీక్వెల్ ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ‘సంచారమే’ వీడియో సాంగ్ విడుదల.
  • గోరేటి వెంకన్న సాహిత్యం, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణ.
  • ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి కలిసి నటిస్తున్నారు.
  • ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

90స్ వెబ్ సిరీస్ సీక్వెల్‌గా వస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాలోని ‘సంచారమే’ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలోని సాహిత్యం గోరేటి వెంకన్న అందించగా, సంగీతం హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచారు.

‘సంచారమే’ పాట విడుదల

EPIC First Semester: 90స్ వెబ్ సిరీస్ సీక్వెల్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (EPIC First Semester) సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘సంచారమే’ (Sancharame Video Song)ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ చిత్రంలోని ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరిస్తోంది. ఇంతకు ముందు వదిలిన చిన్న ప్రోమోనే సోషల్ మీడియాలో ఎలాంటి స్పందనను రాబట్టుకుందో తెలియంది కాదు. ఇప్పుడు ఏకంగా ఫుల్ వీడియో సాంగ్‌నే మేకర్స్ వదిలారు. ఈ సాంగ్‌కు ఉన్న స్పెషల్ గురించి ఆల్రెడీ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ పాట స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హృదయాన్ని తాకే భావాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆయన ఈ పాట రాయడమే కాకుండా, హమ్మింగ్, చివరిలో ఓ చరణం కూడా ఆలపించారు.

గోరేటి వెంకన్న సాహిత్యం, సంగీతం

వాస్తవానికి ఈ పాటను సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ఆయన మొదటి రెండు చరణాలు పాడితే.. చివరిలో గోరేటి వెంకన్న అందుకున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ కంటే కూడా గోరేటి వెంకన్న (Goreti Venkanna) వాయిస్‌లో ఈ పాట వినడానికి చాలా చక్కగా ఉంది. పాటకు తగిన ఫీల్‌ని ఆ వాయిస్ తీసుకొస్తోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ఈ పాట ప్రతిబింబిస్తోంది. ఈ సినిమా కథనానికి అనుగుణంగా ఈ పాట సాగుతుందని మేకర్స్ కూడా తెలిపారు. ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇచ్చిన సంగీతం కూడా హైలెట్ అనేలా ఉంది. ఈ పాట లండన్‌లోని అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తూ సాగుతోంది. అంతర్జాతీయ ప్రకృతి దృశ్యాలను, తెలుగు స్వరాల మాధుర్యాన్ని మిళితం చేస్తూ ఈ పాటను పిక్చరైజ్ చేశారు.

ఆనంద్, వైష్ణవిల జోడి

బ్లాక్‌బస్టర్ ‘బేబీ’ తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జోడి తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘90s’ వెబ్ సిరీస్‌తో అందరి మనసులు గెలుచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను భావోద్వేగాలతో కూడిన సెన్సిటివ్ ప్రేమకథగా నిర్మాతలు అభివర్ణిస్తున్నారు. యూత్‌ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లుగా ఈ పాట, ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మొత్తానికి ‘సంచారమే’ పాట వినడానికి ఆహ్లాదకరంగా ఉంది. గోరేటి వెంకన్న సాహిత్యం, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సినిమాకు మంచి హైలైట్ అవుతుంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.