
📌 Key Points
- మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా, విధానపరంగా విఫలమైందని ఆశన్న అన్నారు.
- ఝిరామ్ లోయ దాడిని సమీక్షించామని, అది పూర్తిగా తప్పని ఆయన అభిప్రాయపడ్డారు.
- సల్వా జుడుం ఉద్యమకారుడు మహేంద్ర కర్మను చంపడం సరైనదేనని చేతు అన్నారు, కానీ కాంగ్రెస్ నేతలను చంపడం తప్పన్నారు.
- 15 ఏళ్ల వయసులోనే పార్టీలో చేరానని, మహిళగా వివక్ష ఎదురుకాలేదని రణిత తెలిపారు.
మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న ఝీరమ్ వ్యాలీ దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి ఒక తప్పిదమని, మావోయిస్టు పార్టీ విధానపరంగా విఫలమైందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతల హత్యకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇది రాజకీయ దుమారం రేపుతోంది.
మావోయిస్టు పార్టీ వైఫల్యాలు: ఆశన్న విశ్లేషణ
కేవలం వ్యూహంలోనే కాదు, విధాన పరంగా మావోయిస్టు పార్టీ విఫలం అయిందని మాజీ మావోయిస్టు అగ్రనేత రూపేశ్ అలియాస్ ఆశన్న అన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే కాదు అనుకూలంగా ఉన్నప్పుడూ కూడా పతనాన్ని చూసిందన్నారు. 10 ఏళ్ల క్రితమే మా పంథాను మార్చుకోవాల్సిందన్నారు. తాజాగా సంచలనం సృష్టించిన ఝిరామ్ లోయ దాడి ఘటనలో దర్బా కమిటీకి చెందిన మావోయిస్టు నేత చేతు ఇలాయాశ్ శ్యామ్ తో కలిసి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశన్న పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సుదీర్ఘ పోరాటంలో, మేము కొన్ని చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామమని వాటి గురించి మేము ఇప్పటికీ తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని ఆశన్న తెలిపారు. అసలు జరగకూడని కొన్ని సంఘటనలు జరిగాయని.. 2013 మే 25న ఝిరామ్ వ్యాలీ జరిగిన సంఘటన అలాంటిదేనన్నారు. తర్వాత ఈ దాడిని క్షణ్ణంగా సమీక్షించామని అది పూర్తిగా తప్పుడు చర్య అని హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఝిరామ్ వ్యాలీలో ఏం జరిగిందో వివరించారు. ఈ ఘటనకు ముందే పోలీసులు రక్షణలో వస్తున్నారని తెలిసింది. పోలీసులపై దాడి చేసి వారి వద్ద ఉన్న ఆయుధాలు లాక్కోవడమే మా లక్ష్యం. ఆ లక్ష్యంతోనే దాడి మొదలు పెట్టాం. కానీ ఆ తర్వాత పెద్ద రాజకీయ నాయకులు రాబోతున్నారని వార్త అందిందన్నారు.
ఝీరమ్ వ్యాలీ దాడిపై మావోయిస్టుల క్షమాపణ
ఈ సందర్భంగా చేతు దాదా మాట్లాడుతూ ఝీరామ్ వ్యాలీ దాడిలో సల్వా జుడుం ఉద్యమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన మహేంద్ర కర్మకు జరిగింది సరైనదేనన్నారు. కానీ, కాంగ్రెస్ నేతలను చంపడం పెద్ద తప్పుఅన్నారు. ఆ ఘటనపై మేము సమీక్ష చేసుకున్నామని వారి మరణానికి మేము క్షమాపణలు చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే విద్యా రాయబారులను చంపి ఉండకూడదని దానిని వేరే విధంగా పరిష్కరించి ఉండవచ్చన్నారు.
రూపేష్‌తో పాటు సరెండర్ అయిన మాడ్ విభాగం కార్యదర్శి రణిత మాట్లాడుతూ తాను కేవలం 15 ఏళ్ల వయసులోనే పార్టీలో చేరానని చెప్పారు. ఆ సమయంలో నా ఇష్టానికి వ్యతిరేకంగా తనకు బలవంతపు పెళ్లి చేస్తున్నారు నేను జీవితంలో వేరే ఏదైనా చేయాలనుకున్నానని వివరించారు. ఒక మహిళ అయినందున సంస్థలో తాను ఎలాంటి వివక్షను ఎదుర్కోలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. సామాజిక అసమానతలు, కుటుంబ ఒత్తిడి కారణంగానే చాలా మంది మహిళలు ఆయుధాలు చేపట్టవలసి వచ్చిందని తెలిపారు. గడ్చిరోలికి చెందిన ప్రాంతీయ కమిటీ సభ్యుడు బాజీరావు మాట్లాడుతూ ఆ ప్రాంతంలో అంటరానితనం, దోపిడీలు ప్రబలంగా ఉండేవని ఇది ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని సృష్టించాయన్నారు. దానితో వారు మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారని తెలిపారు.
యువత, మహిళల మావోయిస్టు పార్టీలో చేరికకు కారణాలు
ఇంకా అజ్ఞాతంలో ఉన్న గణపతి, మిషిర్ బెస్రా వంటి అగ్రనేతలు బయటకు రావాలని ఆశన్న పిలుపునిచ్చారు. నేను గత 6 నెలలుగా వారందరినీ కోరుతున్నాను. ఇప్పటికైనా పరిస్థితులను అర్థం చేసుకుని, రాజ్యాంగ పరిధిలోకి వచ్చి ప్రజల సమస్యలపై పని చేయాలన్నారు.
మాజీ మావోయిస్టు నేతల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఝీరమ్ వ్యాలీ దాడి ఘటనపై వారి విశ్లేషణ, క్షమాపణలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.


