|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా ఇండస్ట్రీలో పెను సంక్షోభం: 6 నెలలు థియేటర్లు బంద్.. నిర్మాతలకి ఎగ్జిబిటర్ల అల్టిమేటం!

Published: 14-05-2026, 5:46 PM
సినిమా ఇండస్ట్రీలో పెను సంక్షోభం: 6 నెలలు థియేటర్లు బంద్.. నిర్మాతలకి ఎగ్జిబిటర్ల అల్టిమేటం!
  • తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది.
  • 2008 నుండి ఈ సమస్యపై పోరాడుతున్నామని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ వెల్లడించారు.
  • సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీ నష్టాల్లో ఉన్నాయని, బతకడం కష్టమని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
  • డిమాండ్లు నెరవేరకపోతే 6 నెలల పాటు థియేటర్లు మూసేస్తామని ఎగ్జిబిటర్లు హెచ్చరించారు.

తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పర్సెంటేజ్ విధానం అమలు చేయాలంటూ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుండగా, నిర్మాతలు అందుకు నిరాకరిస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో, తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆరు నెలల పాటు థియేటర్లు మూసేస్తామని ఎగ్జిబిటర్లు హెచ్చరించారు.

పర్సెంటేజ్ విధానంపై మళ్ళీ రచ్చ

Percentage System : పర్సెంటేజ్..పర్సెంటేజ్..పర్సెంటేజ్…ఈ పదమే గత రెండు మూడు రోజులుగా ఫిలిమ్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. మాకు రెంటల్ వర్కౌట్ అవ్వట్లేదు,పర్సెంటేజ్ కావాల్సిందే అంటూ తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పెట్టగా, ఇప్పుడే కష్టమంటూ గిల్డ్ ప్రొడ్యూసర్స్ కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెల్సిందే.ఇక ఇదిలా ఉండగా దానికి కౌంటర్ గా ఈరోజు సినీ ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో సి. కళ్యాణ్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ రామ్ మోహన్ రావు, అనుపమ్ రెడ్డి, బాల గోవింద్ వంటి ప్రముఖులు పాల్గొని ప్రొడ్యూసర్లపై ఫైర్ అయ్యారు

ఆవేదన బయట పెట్టిన ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ ఉన్నపళంగా మేమీ సమస్యని లేవనెత్తలేదని 2008 నుంచి ఈ పర్సెంటేజ్ విధానం కోసం పోరాడుతున్నామని గుర్తుచేశారు. “హరిహర వీరమల్లు సినిమా సమయంలోనే ఈ డిమాండ్ పెట్టాం. అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కోసం వివాదం చేస్తున్నామనడం హాస్యాస్పదం. సమస్య పరిష్కారం కాకపోవడం వల్లే మళ్ళీ మా వాయిస్ రైజ్ చేస్తున్నాం.ఒకప్పుడు తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్లు ఉండేవి,కాని ఇప్పుడు అవి 400కి పడిపోయాయి. ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో అసలు సింగిల్ స్క్రీన్స్ అనేవే ఉండవు అంటూ అని మనసులోని ఆవేదనని బయట పెట్టారు.

నష్టాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు

ఘాటుగా రియాక్ట్ అయిన అనుపమ్ రెడ్డి

ఇక ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్ అనుపమ్ రెడ్డి ప్రొడ్యూసర్స్ చేసిన కామెంట్స్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో పర్సనల్ గా విమర్శించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. లీజుదారుల గురించి మాట్లాడుతున్న ప్రొడ్యూసర్లు , అసలు థియేటర్ ఓనర్ల పరిస్థితి ఏంటో ఆలోచించడం లేదని ఫైర్ అయ్యారు.”నిర్మాతలు వాస్తవాలను పక్కన పెట్టి రాంగ్ డైరెక్షన్‌లో మాట్లాడుతున్నారు. సింగిల్ స్క్రీన్స్ అన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. మాకు పర్సెంటేజ్ విధానం అమలు చేస్తేనే మేము బతకగలం. లీజుదారులు కూడా బిజినెస్ మెన్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని స్పష్టం చేశారు ఎగ్జిబిటర్ అనుపమ్ రెడ్డి.

6 నెలల పాటు థియేటర్లు క్లోజ్

6 నెలలు థియేటర్లు మూసేస్తామంటూ వార్నింగ్

ఇక ప్రముఖ దేవి థియేటర్ ఓనర్ బాలగోవింద్ చేసిన కామెంట్స్ ఇపుడు మరింత సెన్సేషన్ అవుతున్నాయి.గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో హెల్తీ ఎట్మాస్పియర్ ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని ఆవేదన చెందారు. “వరుసగా పెద్ద సినిమాలు వస్తున్నాయని చెప్పి మా పీక నొక్కుతున్నారు. ‘నెక్స్ట్ సినిమా నుంచి చూద్దాం’ అంటూ పోస్ట్ పోన్ చేయడం ప్రొడ్యూసర్స్ కి అలవాటు అయిందని, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే 6 నెలల పాటు థియేటర్లు క్లోజ్ చేయడానికైనా వెనుకడుగు వేయము,కానీ మేము థియేటర్లు క్లోజ్ చేస్తామనట్లేదని, కేవలం మల్టీప్లెక్స్‌లకు ఇచ్చే పర్సెంటేజ్ మాకూ ఇవ్వమని అడుగుతున్నాం” అంటూ కుండబద్దలు కొట్టారు.

ఏది తగ్గుతుందో..ఏది నెగ్గుతుందో

ఈ వివాదం తక్షణమే పరిష్కారం కాకపోతే తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రావాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.