|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mega 158: చిరు-బాబీ స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం.. త్వరలోనే షూట్.. కోల్‌కతా గ్యాంగ్‌స్టర్ గా..

Published: 16-11-2025, 11:41 PM
Mega 158: చిరు-బాబీ స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం.. త్వరలోనే షూట్.. కోల్‌కతా గ్యాంగ్‌స్టర్ గా..

మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ సినిమా కథ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైంది. కోల్‌కతా గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్‌కు సిద్ధమవుతోంది. వారి బ్లాక్‌బస్టర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Key Points

1

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

2

దర్శకుడు బాబీతో చిరంజీవి 158వ సినిమా కథ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైంది.

4

వాల్తేరు వీరయ్య తర్వాత చిరు-బాబీ కాంబోలో ఇది రెండో సినిమా; తమన్ సంగీతం.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత ప్రాజెక్టులు

Mega 158: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నాడు.(Mega 158) ఇప్పటికే ఆయన దర్శకుడు అనిల్ రావిపూడితో “మన శంకర వరప్రసాద్ గారు”అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర మూవీ సమ్మర్ కు రానుంది. ఈ రెండు సినిమాల తరువాత చిరంజీవికి మరో టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

Deepika Padukone: నేనొక బిడ్డకు జన్మనిచ్చాను.. ఆ కన్సర్న్ కూడా లేదా.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన దీపికా

చిరు-బాబీ కాంబోలో మరో భారీ చిత్రం

ఇక ఈ సినెమాల తరువాత మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చిరంజీవి. కేవీఎన్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చేసింది. తాజాగా ఈ సినిమాకి సంబందించిన కథ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం అయినట్టుగా ప్రకటన చేశారు మేకర్స్. ఆ ఫైనల్ డ్రాఫ్ట్ పై కోల్‌కతా భాషలో ఒక కోట్ ను యాడ్ చేశారు. ఈ కథ కోల్‌కతా బ్యాక్డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామా అని తెలుస్తోంది. కోల్‌కతా బ్యాక్డ్రాప్ లో చిరంజీవి చేసిన చూడాలని ఉంది సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. కాబట్టి, అదే బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు మేకర్స్.

కోల్‌కతా గ్యాంగ్‌స్టర్ డ్రామా కథా నేపథ్యం

ఇక దర్శకుడు బాబీ కొల్లి విషయానికి వస్తే, గతంలో ఈ దర్శకుడు మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన విషయం తెలిసిందే. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా రూ.236 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో, ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పూర్తి వివరాలు కూడా త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

చిరంజీవి, బాబీల బ్లాక్‌బస్టర్ కాంబోలో వస్తున్న ఈ కొత్త సినిమా, కోల్‌కతా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా అభిమానుల అంచనాలను మరింత పెంచుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండగా, పూర్తి వివరాల కోసం వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.