|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Express Hari : నా చేతికి గజ్జి వచ్చింది.. తినడానికి ఎవరైనా ఓ 10 రూపాయలు ఇస్తే బాగుండు.. తన కష్టాలు చెప్తూ ఎక్స్‌ప్రెస్ హరి ఎమోషనల్..

Published: 22-06-2025, 5:42 AM
Express Hari : నా చేతికి గజ్జి వచ్చింది.. తినడానికి ఎవరైనా ఓ 10 రూపాయలు ఇస్తే బాగుండు.. తన కష్టాలు చెప్తూ ఎక్స్‌ప్రెస్ హరి ఎమోషనల్..

ప్రముఖ కమెడియన్, రచయిత ఎక్స్‌ప్రెస్ హరి తన జీవితంలోని కష్టకాలను ‘ఆహా కాకమ్మ కథలు’ షోలో పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న ఆకలి, ఆర్థిక ఇబ్బందులు, చదువులోని సవాళ్ల గురించి ఆయన ఎమోషనల్‌గా మాట్లాడాడు.

Key Points

1

ఎక్స్‌ప్రెస్ హరి తన కష్టమైన బాల్య జీవితాన్ని 'ఆహా కాకమ్మ కథలు' షోలో పంచుకున్నాడు.

2

రెసిడెన్షియల్ స్కూల్‌లోని కష్టాలను, ఆకలితో బాధపడిన రోజులను వివరించాడు.

4

కాలేజీ రోజుల్లో ఆకలితో బాధపడి, 10 రూపాయల కోసం ఎదురు చూసిన విషయాన్ని పంచుకున్నాడు.

ఎక్స్‌ప్రెస్ హరి యొక్క కష్టమైన బాల్యం

Express Hari : పటాస్ షోలో రచయితగా, కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎక్స్‌ప్రెస్ హరి ఆ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలలో రైటర్ గా, కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా ఎక్స్‌ప్రెస్ హరి ఆహా కాకమ్మ కథలు షోకి హాజరయ్యాడు. ఈ షోలో తన చిన్నతనం, కాలేజీ ఏజ్ లో పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.

ఎక్స్‌ప్రెస్ హరి మాట్లాడుతూ.. మా నాన్న రైతు. అమ్మనాన్న ఇద్దరూ పొలం పనులకు వెళ్లేవారు. నేను, మా చెల్లి. ఇద్దర్ని చదివించే స్థోమత లేదు. అందుకే చిన్నప్పుడే రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రీగా ఫుడ్, చదువు చెప్తారని. అక్కడ 250 మంది ఉంటారు. స్నానం చేయడానికి 8 ట్యాప్ లే ఉంటాయి. అందులో నాలుగే పనిచేస్తాయి. గంటలో అందరూ స్నానం చేసేయాలి. అక్కడ ఎలా బతికామో కూడా తెలీదు. ఎక్కువ రోజులు స్నానం చేయక కుడిచేతికి గజ్జి వచ్చింది. అన్నం తింటుంటే ఆ బ్లడ్ అన్నంలో పడేది. ఉదయం నాలుగు ఇడ్లిలు పెట్టేవాళ్ళు. అందరం పొద్దున్నే పల్లాలు పట్టుకొని టిఫిన్ ఏం పెడతారో అని ఎదురుచూసేవాళ్ళం. కానీ అలాంటి ఫుడ్ తిన్నా, అలా బతికినా బాగా చదువు చెప్పేవాళ్ళు, చదువుకునేవాళ్ళం.

రెసిడెన్షియల్ స్కూల్ జీవితంలోని సవాళ్లు

మా నాన్న సంవత్సరానికి ఒక 40 వేలు సంపాదించేవాడు. స్కూల్ లో బాగా చదివినా నేను ఇంటర్ లో జాయిన్ అయితే అక్కడ సంవత్సరానికి 50 వేలు ఫీజు. అయినా నాన్న జాయిన్ చేసాడు. అక్కడేమో నాకు ఇంగ్లీష్ అర్ధమయ్యేది కాదు. రిగ్రెట్ ఫీల్ అయ్యా. నాన్న డబ్బులు కడుతున్నాడని అయినా కష్టపడి చదివా. ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాలేదు. వైజాగ్ దగ్గర ఓ చిన్న కాలేజీలో బిటెక్ జాయిన్ అయ్యా. రూమ్ లో ఉండేవాడిని. మా నాన్న నెలకు 5000 ఇచ్చేవాడు. అది రూమ్ రెంట్ కి వెళ్లిపోయేది. మధ్యాహ్నం ఎవడైనా ఓ పది రూపాయలు ఇస్తే చపాతీ కొనుక్కుందాం, ఆకలి తీర్చుకుందాం అనుకునేవాడిని. ఎవడూ ఇచ్చేవాడు కాదు. నీళ్లు తాగి చదువుకునేవాడ్ని. ఇండస్ట్రీకి వచ్చాకే సంపాదించడం మొదలుపెట్టా అంటూ తన జీవితంలోని కష్టాల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

కాలేజీ రోజుల్లోని ఆర్థిక ఇబ్బందులు

ఎక్స్‌ప్రెస్ హరి తన కష్టాలను ధైర్యంగా పంచుకోవడం అభినందనీయం. ఆయన అనుభవాలు చాలా మందికి స్ఫూర్తినిస్తాయి. తన కష్టాలను అధిగమించి సక్సెస్ అయినందుకు ఆయనకు శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.