
ఫహాద్ ఫాజిల్ మరియు కల్యాణి ప్రియదర్శన్ నటించిన ‘ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర’ అనే మలయాళ రొమాంటిక్ కామెడీ సినిమా సెప్టెంబర్ 26 నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఐఎండీబీలో 7.2 రేటింగ్‌ను సాధించింది.
Key Points
ఫహాద్ ఫాజిల్, కల్యాణి ప్రియదర్శన్ నటించిన 'ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర' నెట్‌ఫ్లిక్స్‌లో!
సెప్టెంబర్ 26 నుండి తెలుగుతో సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్.
పెళ్లి, కోమా, మరియు కొత్త ప్రేమతో సాగే ఆసక్తికర కథ!
‘ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర’ విడుదల తేదీ
ఈవారం ఓటీటీలోకి రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఓ మలయాళం మూవీ కూడా ఉంది. వెరైటీ టైటిల్ తో వచ్చిన సినిమా అది. ఈ మూవీ పేరు ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర (Odum Kuthira Chaadum Kuthira). దీనర్థం ఎగిరే గుర్రం పరుగెత్తే గుర్రం అని. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ విశేషాలేంటో తెలుసుకోండి.
ఒడుం కుతిర చాడుమ్ కుతిర మూవీ ఓటీటీ స్ట్రీమింగ్
ఫహాద్ ఫాజిల్ , కల్యాణి ప్రియదర్శన్ నటించిన మూవీ ఈ ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర. ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 26) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
నటీనటులు మరియు కథాంశం
కొన్ని రోజుల కిందట ఈ విషయం వెల్లడించిన ఆ ఓటీటీ తాజాగా బుధవారం (సెప్టెంబర్ 24) కూడా మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర సెప్టెంబర్ 26 నుంచి మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడలలో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.
ఒడుం కుతిర చాడుమ్ కుతిర మూవీ గురించి..
ఈ మలయాళం రొమాంటిక్ కామెడీ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల్లోనే అంటే సెప్టెంబర్ 26నే ఈ మూవీ ఓటీటీ డెబ్యూ చేయనుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి అల్తాఫ్ సలీమ్ డైరెక్టర్. ఇందులో కల్యాణి ప్రియదర్శన్, రేవతి పిళ్లై హీరోయిన్లు.
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఎబీ (ఫాహద్ ఫాజిల్), నిధి (కల్యాణి ప్రియదర్శన్)కి పెళ్లి కుదురుతుంది. వాళ్ల పెళ్లి మురిపెంలో ఉంటారు. అయితే తమ ఎంగేజ్మెంట్ రోజు రాజులా గుర్రంపై రావాలని ఎబీకి నిధి చెబుతుంది. కాబోయే భార్య కోరికకు అతడు ఓకే చెప్తాడు. గుర్రంపై ఎంగేజ్మెంట్ కు వస్తుంటాడు. కానీ సడెన్ గా అదుపు తప్పి గుర్రంపై నుంచి పడిపోతాడు. తీవ్ర గాయాలవుతాయి. అప్పుడు కోమాలోకి వెళ్లిపోతాడు. ఇక్కడే కథ మలుపు తీసుకుంటుంది.
ఎబీ కోమాలోకి వెళ్లిపోవడంతో నిధిని మరో పెళ్లి చేసుకోమని ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి చేస్తారు. అందుకు నిధి తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే చెప్తుంది. ఆ సమయంలోనే ఎబీ తిరిగి కోలుకుంటాడు. కానీ నిధి తనకు దక్కదని అతనికి అర్థమవుతుంది. ఇక బెంగళూరు వెళ్లి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అక్కడ అతనికి మరో అమ్మాయి రేవతి (రేవతి పిళ్లై) పరిచయమవుతుంది. మరి అతను రేవతిని ప్రేమించాడా? అతని జీవితంలోకి తిరిగి నిధి వచ్చిందా? చివరకు ఏం జరిగిందనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ఫహాద్ ఫాజిల్ అభిమానులకు ‘ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర’ మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిద్దాం. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను తప్పకుండా చూడండి.


