
📌 Key Points
- సోనాలి బింద్రేపై భూ ఆక్రమణ కేసు నమోదు చేసిన రైతు చంద్రకాంత్!
- 1957 నుంచి తమ వంశపారంపర్యంగా వస్తున్న భూమిని ఆక్రమించారని ఆరోపణలు!
- భూమిని చట్టబద్ధంగానే కొనుగోలు చేశానని సోనాలి బింద్రే స్పష్టీకరణ!
- తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు కుట్ర చేస్తున్నారని సోనాలి బింద్రే ఆగ్రహం!
టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఆమెపై ఓ రైతు భూ ఆక్రమణ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అసలు ఈ వివాదం ఏంటో తెలుసుకుందాం.
సోనాలి బింద్రేపై రైతు ఫిర్యాదు!
అలనాటి టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే ( Sonali Bendre ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ అందాల తార సోనాలి బింద్రే, తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇలాంటి సోనాలి బింద్రే, ఆమె భర్త గోల్డి బెహల్ తన 30 గుంటల భూమిని ఆక్రమించాడని పూణే ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ అనే రైతు కేసు పెట్టాడు. తాజాగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి, సోనాలి బింద్రే ఫ్యామిలీపై ఫిర్యాదు చేశాడు.
భూమి ఆక్రమణ ఆరోపణలు!
ఈ భూమి 1957 నుంచి వంశ పారంపర్యంగా వస్తోందని పేర్కొన్న రైతు చంద్రకాంత్, తనను బెదిరించి భూమిని ఆక్రమించారని ఆరోపణలు చేశారు. అయితే ఈ భూమి వివాదంపై సోనాలి బింద్రే కూడా రియాక్ట్ అయ్యారు. తాను చట్ట బద్ధంగానే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు సోనాలి బింద్రే స్పష్టం చేస్తున్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలా కొంత మంది కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ భూమిపై కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. తాను ఎవరిని మోసం చేయలేదని.. న్యాయ బద్ధంగానే భూమిని సొంతం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో సోనాలి బింద్రే వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
స్పందించిన సోనాలి బింద్రే!
A post shared by Dcn Pcmc (@dcnpcmc)
సోనాలి బింద్రే ల్యాండ్ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


