|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Fatima Sana Shaikh: తమన్నా మాజీ ప్రియుడితో డేటింగ్‌.. దంగల్ నటి క్లారిటీ!

Published: 26-06-2025, 8:17 AM
Fatima Sana Shaikh: తమన్నా మాజీ ప్రియుడితో డేటింగ్‌.. దంగల్ నటి క్లారిటీ!

దంగల్‌లో గీతా పాత్రతో మనసు దోచుకున్న ఫాతిమా సనా షేక్‌పై తాజాగా డేటింగ్ రూమర్స్ వైరల్ అయ్యాయి. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మతో ఆమె నటించడంతో ఈ ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై ఆమె స్పందించింది.

Key Points

1

ఫాతిమా సనా షేక్ తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటిస్తున్నారు.

2

డేటింగ్ రూమర్స్‌కు ఫాతిమా స్పందిస్తూ ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని చెప్పారు.

4

'ఆప్ జైసా కోయి' చిత్రం జూలై 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుంది.

డేటింగ్ రూమర్స్‌పై ఫాతిమా స్పందన

దంగల్‌ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అమిర్‌ ఖాన్ దంగల్‌ మూవీలో గీతా ఫోగట్ పాత్రలో ఆమె అదరగొట్టేసింది. 2015లో ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ ‍అనే చిత్రంలోనూ నటించింది.  అయితే ఆ మూవీ తర్వాత మరో సినిమా చేస్తున్న క్రమంలోనే  ఒక నిర్మాత నుంచి కాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు  గతంలో చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె ‘మెట్రో… ఇన్ డినో’ అనే మూవీలో కనిపించనుంది.

ఈ మూవీ తర్వాత ఫాతిమా సనా షేర్.. గుస్తాక్ ఇష్క్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మ హీరోగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి జంటగా కనిపించారు. దీంతో ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. విజయ్ వర్మతో సనా డేటింగ్‌లో ఉందంటూ రూమర్స్ పుట్టకొచ్చాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న  ఊహాగానాలపై ఫాతిమా సనా షేక్ స్పందించింది. తన రాబోయే చిత్రం ఆప్ జైసా కోయి’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె మాట్లాడారు. మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? అడిగిన ప్రశ్నకు ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని. నా జీవితంలో ఎవరూ లేరని స్పష్టం చేసింది.

‘ఆప్ జైసా కోయి’ చిత్ర విడుదల

ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ..’ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉన్నా. నా లైఫ్‌లో ఎవరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు మంచి వ్యక్తులంటూ ఎవరూ లేరు. మంచివాళ్లు కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటారు. మీరు ఏదైనా పార్ట్‌నర్‌షిప్‌లో ఉంటే మిమ్మల్ని మీరు కోల్పోకుండా రిలేషన్‌ స్ట్రాంగ్‌ ఉండేందుకు కృషి చేస్తారు. రిలేషన్‌ బలంగా ఉండాలంటే అదే మార్గమని నేను భావిస్తున్నా’ అని క్లారిటీ ఇచ్చేసింది.

విజయ్ వర్మతో ఫాతిమా నటన

ఆప్ జైసా కోయి మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రేమ, సమానత్వం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవిస్తారు. వారు ఒకరి మాట ఒకరు వింటారు. వాటిని తిరస్కరించరు. ఈ సినిమాలో ప్రేమ, సమానత్వం గురించేనని.. ఈ విషయంలో ఇద్దరూ రాజీ పడాలని ఫాతిమా సనా షేక్ తెలిపింది. కాగా.. ఆప్ జైసా కోయి చిత్రంలో ఆర్ మాధవన్ సరసన నటించింది. మాధవన్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా అద్భుతంగా అనిపించిందని వెల్లడించింది. ఇప్పటికే ‘ఆప్ జైసా కోయి’ ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూలై 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

చివరగా, ఫాతిమా సనా షేక్ తన వ్యక్తిగత జీవితం గురించి స్పష్టత ఇస్తూ, తాను ఒంటరిగానే ఉన్నానని తెలిపారు. ‘ఆప్ జైసా కోయి’ చిత్రం వారికి మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.