
📌 Key Points
- ఫౌజీ మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం, స్వల్పంగా గాయపడ్డ వ్యక్తి, ఎటువంటి ప్రాణ నష్టం లేదు!
- ప్రభాస్‌కి ప్రమాదం తప్పింది, అభిమానుల ఆందోళన వీడింది, డార్లింగ్ క్షేమంగా ఉన్నారు.
- డిసెంబర్‌లో విడుదల కానున్న ‘ఫౌజీ’, యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమ కథ!
- హను రాఘవపూడి దర్శకత్వం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం, భారీ తారాగణం!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రభాస్‌కి ఏమైనా జరిగిందా? సినిమా విడుదల ఎప్పుడు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫౌజీ సెట్‌లో అగ్నిప్రమాదం: అసలేం జరిగింది?
ప్రభాస్ ప్రస్తుతం `స్పిరిట్` మూవీతోపాటు `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. `ఫౌజీ` మూవీ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుందట. సినిమా కోసం వేసిన సెట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా సెట్‌లో సడెన్‌గా మంటలు అంటుకున్నాయని, టెంట్లు, ఇతర సామగ్రి పాక్షికంగా కాలిపోయిందనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఓ వ్యక్తికి స్వల్పంగా గాయాలు అయ్యాయట. ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన లేదని సమాచారం.
ప్రభాస్‌కి తప్పిన ప్రమాదం: అభిమానుల ఆందోళన!
ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం అనేసరికి డార్లింగ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ సెట్‌లో ప్రభాస్ లేరని సమాచారం. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే మొదట `స్పిరిట్` మూవీ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుందనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని, `ఫౌజీ` మూవీ సెట్‌లో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని టాక్. దీంతో షూటింగ్ నిలిపివేశారని, మళ్లీ శుక్రవారం నుంచి స్టార్ట్ చేయబోతున్నారట. కాకపోతే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేదు. టీమ్ స్పందిస్తే గానీ ఏం జరిగిందనేది క్లారిటీ వస్తుంది.
డిసెంబర్‌లో ఫౌజీ రిలీజ్: మూవీ అప్‌డేట్స్!
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `ఫౌజీ` చిత్రంలో ఇమాని హీరోయిన్‌గా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవింద్రన్ వంటి వారు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ప్రధానంగా మూవీ రన్ అవుతుందట. ఇందులో సైనికుడిగా ప్రభాస్ కనిపిస్తారని, యాక్షన్, లవ్ స్టోరీ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. దేశం కోసం పోరాడిన ఒక వీరుడి కథని ఇందులో చూపించబోతున్నారట హను రాఘవపూడి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ తప్ప మరే అప్ డేట్ రాలేదు. దీంతో అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కాబోతుందని సమాచారం. ఆ దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సినిమా ఔట్‌పుట్ బాగా వస్తుందని, షూటింగ్ అయిపోయాక ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని సమాచారం.
ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ గురించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


