
గుండె నిండా గుడి గంటలు సీరియల్ 504వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి మీనాకు ముద్దు పెట్టడం, బాలు సంజూని ఆట పట్టించడం, బెడ్ రూమ్ గది విషయంలో రచ్చ వంటి సంఘటనలు ఈ ఎపిసోడ్ లో ప్రధాన ఆకర్షణలు.
Key Points
ప్రభావతి మీనాకు ముద్దు పెట్టింది!
బాలు సంజూని ఆట పట్టించాడు!
సుశీల అందరూ పైన పడుకుందాం అని ప్లాన్ వేసింది!
ప్రభావతి, మీనా, మరియు ముద్దు
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 504వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కొన్ని సరదా సీన్లు, మరికొన్ని ఉత్కంఠ రేపే సీన్లను ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. సంజూని చంపేస్తానంటూ బాలు ఆవేశంతోపాటు చివరికి అతడిని ఆట పట్టించే సీన్ వరకూ ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. అయితే మీనాకు ప్రభావతి ముద్దు పెట్టడమే హైలైట్.
సంజూకి బెడ్‌రూమ్ విషయంలో రచ్చ
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 5) ఎపిసోడ్ సంజూ, మౌనికకు ఎవరి బెడ్ రూమ్ ఇవ్వాలన్న దానిపై అందరూ మాట్లాడుకునే సీన్ తో మొదలవుతుంది. మనోజ్ గది అయితే బాగుంటుందని ప్రభావతి అంటే.. ఆయనకు ఆ గదిలో తప్ప బయట నిద్ర పట్టదని, కుదరదని రోహిణి అంటుంది. తాను మౌనికకు రూమ్ ఇస్తాను కానీ ఆ సంజూకి ఇవ్వనని రవి అంటాడు. వాళ్లు మాట్లాడుకుంటుండగా.. చాటు విన్న సంజూ బెడ్ రూమ్ గురించి మాట్లాడుకుంటున్నారా? అయితే ఆ బాలుగాడి రూమ్ తీసుకొని వాడిని బయటకు గెంటేయాలని అనుకుంటాడు.
డైనింగ్ టేబుల్ దగ్గర బాలు వర్సెస్ సంజూ
డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ తినడానికి కూర్చొంటారు. బాలు , సంజూ పక్కపక్కనే కూర్చోవడంతో వాళ్లు ఎక్కడ గొడవ పడతారో అని అందరూ కంగారు పడతారు. అనుకున్నట్లే ఇద్దరి మధ్యా మాటామాటా నడుస్తుంది. అల్లుడికి ప్రభావతి వెండి ప్లేట్ వేస్తుంది. అది సత్యం వాళ్ల నాన్నది అని బాలు చెబుతాడు. మరొకరు తిన్న ప్లేట్ లో తాను తిననని, విస్తరాకు వేయమని అనడంతో అలాగే చేస్తారు.
బాలు, సంజూ మధ్య ఆట
తిన్న వెంటనే తనకు నిద్ర వస్తుందని సంజూ అంటాడు. అందుకే నీకు రూమ్ చూపిస్తాం పదండి అని సంజూని బాలు, రవి పైకి తీసుకెళ్తుంటే మనోజ్ కంగారుగా వాళ్ల వెంటే వెళ్తాడు. పైకి వెళ్లిన తర్వాత మనోజ్ ను బాలు ఇరికిస్తాడు. తనది, రవి రూమ్ చూపిస్తూ ఈ రెండింట్లో ఏ రూమ్ కావాలంటే అది తీసుకోండి.. కానీ ఆ రూమ్ మాత్రం వద్దు అని మనోజ్ రూమ్ చూపిస్తూ అంటాడు. దీంతో సంజూ తనకు అదే రూమ్ కావాలని అంటాడు. ఇది బాలుగాడి రూమ్ అనుకుంటా.. అందుకే వద్దంటున్నాడు.. వాడిని బయటకి పంపిస్తా అని లోపల అనుకొని అదే రూమ్ కావాలంటూ అందులోకి వెళ్తాడు. దీంతో మనోజ్ ఇరుక్కుంటాడు.
ఇటు కింద సుశీల అందరం పైన పడుకుందాం అని ప్లాన్ వేస్తుంది. దానికి బాలు, మీనా సరే అంటారు. తాము కూడా వస్తామని రవి, శృతి అంటారు. అయితే నీ రూమ్ తమకు ఇచ్చేయమని మనోజ్ అంటే సరే తీసుకొని అని చెప్పి వెళ్తారు. మేడపై అందరూ కూర్చొని సరదాగా చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే మౌనిక కూడా రావడంతో ఆమె కూడా వాళ్లతో చేరుతుంది.
మౌనిక కంటతడి.. అబద్ధం చెప్పి..
చిన్నతనంలో మనోజ్ విషయంలో బాలు చేసిన సరదా విషయాలు చెప్పి రవి నవ్విస్తుంటే.. మౌనిక మాత్రం కంటతడి పెడుతుంది. తన అత్తింట్లో సంజూ పెట్టే హింసలు గుర్తుకు తెచ్చుకుంటుంది. దీంతో ఏమైందమ్మా అని బాలు అడుగుతాడు. ఏం లేదు.. మీరందరూ ఇలా మాట్లాడుకుంటుంటే ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది అంతే అని మౌనిక కవర్ చేస్తుంది. మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడు కదా అని బాలు అడుగుతాడు. హా బాగానే చూసుకుంటున్నాడు అని అంటుంది. ఏమైనా అంటే చెప్పు మీనా ఇటుక రాయి, నేను క్రికెట్ బ్యాట్, రవి గరిటె పట్టుకొని వస్తాం అని శృతి జోక్ చేస్తుంది.
మౌనికను తిట్టిన సంజూ.. బాలు ఆవేశం
బెడ్ రూమ్ రచ్చ
అదంతా చాటుగా విన్న సంజూ వాళ్ల దగ్గరికి వచ్చి మౌనికను తనకు నిద్ర వస్తుందంటూ కిందికి తీసుకెళ్తాడు. రూమ్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఆమెను తిడతాడు. నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్లు తిడితే నువ్వు నవ్వుతావా? మీ అన్నకు కొవ్వు బాగా ఎక్కువైంది.. ఇంటికి వెళ్లిన తర్వాత నీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్ ఇస్తూ లోనికి వెళ్లి డోర్ వేస్తాడు.
మౌనిక చేతి వేళ్లు అందులో నలుగుతాయి. అప్పుడే కిందికి వచ్చిన బాలు అది చూసి ఆవేశంతో అతన్ని చంపేస్తానంటూ ఊగిపోతాడు. పైకి వెళ్లి సుశీల, రవి, శృతికి కూడా జరిగిన విషయం చెబితే.. రవి, శృతి కూడా ఆవేశంతో ఊగిపోతారు. మీనా, సుశీల వాళ్లకు సర్దిచెబుతారు.
మీనాకు నుదుటిపై ప్రభావతి ముద్దు
మరుసటి రోజు బాలు, మీనా పెళ్లిరోజు. ఈ సందర్భంగా వాళ్లు సుశీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఇష్టం లేకపోయినా వాళ్లను ప్రభావతి కూడా ఆశీర్వదిస్తుంది. అది చూసిన సుశీల.. నువ్వు ఈ కోడలిని ప్రేమగా దగ్గర తీసుకోవడం ఎప్పుడూ చూడలేదు.. ఇప్పుడు మీనాకు నుదుటిపై ముద్దు ఇవ్వాల్సిందే అని ఆర్డర్ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ముద్దు పెడుతుంది. ఇలాంటి సీన్ మళ్లీ కనిపించదు అంటూ బాలు ఫొటో తీస్తాడు.
ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కోసం రెడీ కాగా.. పూరి, కుర్మా చేశానని మీనా అంటుంది. తాను ఆయిల్ ఫుడ్ తినని సంజూ ఓ పిజ్జా ఆర్డర్ చేసుకుంటాడు. దానిపై బయటే బాలు బాగా కారం చల్లి లోనికి తీసుకొస్తాడు. తినండి బావ అంటూ సంజూకి బలవంతంగా తినిపిస్తాడు. దానిని తిన్న సంజూ, మనోజ్ కారం అంటూ విలవిలలాడిపోతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లోని ఈరోజు ఎపిసోడ్ లో చాలా ఉత్కంఠభరితమైన మరియు హాస్యభరితమైన సన్నివేశాలు ఉన్నాయి. ప్రేక్షకులను అలరించే ఈ ఎపిసోడ్ తో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది.


