|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: చిరు సినిమాను డామినేట్ చేసిన కుర్ర హీరో మూవీ! ఓటీటీ రికార్డులు బద్దలు!

Published: 10-04-2026, 3:35 AM
షాకింగ్: చిరు సినిమాను డామినేట్ చేసిన కుర్ర హీరో మూవీ! ఓటీటీ రికార్డులు బద్దలు!
  • చిరంజీవికి షాక్ ఇచ్చిన యంగ్ హీరో సుహాస్! ‘హే బల్వంత్’ మూవీ జీ5లో టాప్ ట్రెండింగ్!
  • సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఓటీటీలో సందడి, టాప్ 5లో దూకుడు!
  • రవితేజ ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ జీ5లో స్ట్రీమింగ్, 7వ స్థానంలో నిలిచిన ఫ్యామిలీ డ్రామా!
  • ఆది పినిశెట్టి ‘శబ్దం’ మూవీ జీ5లో ఆరో స్థానంలో ట్రెండింగ్, థ్రిల్లింగ్ ఎంటర్టైనర్!

ఓటీటీలో సినిమాల హవా కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పుడు ఒక కుర్ర హీరో సినిమా ఏకంగా చిరంజీవి సినిమాకే షాక్ ఇచ్చింది. ఆ సినిమా ఏంటో తెలుసా?

చిరంజీవి సినిమాకు షాక్ ఇచ్చిన కుర్ర హీరో

ఓటీటీ సినిమాలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. థియేటర్లో సినిమాని చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఓటీటీలోనే ఎక్కువగా చూస్తున్నారు. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలకు విశేష ఆదరణ దక్కుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు కుర్ర హీరో సినిమా జీ5 ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఇది ఏకంగా చిరంజీవి, వెంకటేష్‌ సినిమాలకు పెద్ద ఝలక్‌ ఇవ్వడం విశేషం. అదే `హే బల్వంత్‌`. ఇది ఇండియా వైడ్‌గా టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది.

జీ5లో టాప్‌ 10లో ట్రెండ్‌ అవుతున్న చిత్రాల్లో `ఎవ్రీ బడీ లవ్స్ సోహ్రబ్‌ హండా` అనే మూవీ నెంబర్‌ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో తెలుగు మూవీ ట్రెండ్‌ కావడం విశేషం. అదే సుహాస్‌, శివానీ నగరం జంటగా నటించిన `హే బల్వంత్‌` . కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఆ మధ్య థియేటర్లోకి వచ్చి మంచి ఆదరణ పొందింది. థియేట్రికల్‌గా అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఇండియా వైడ్‌గా రెండో స్థానంలో ట్రెండ్‌ కావడం ఆశ్చర్యపరుస్తోంది. ఇది చిరంజీవి మూవీకి షాక్‌ ఇవ్వడం విశేషం.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేష్‌, నయనతార కలిసి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ ఈ సంక్రాంతికి విడుదలై పెద్ద బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిన విషయం తెలిసిందే. రీజినల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇదిప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ   టాప్‌ 5లో ఉండటం గమనార్హం. కుర్ర హీరో సుహాస్‌ మూవీ కంటే  వెనకబడిపోయింది. అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి నెల రోజులకుపైగానే అవుతోంది. ప్రారంభంలో టాప్‌లో ఉన్న ఈ మూవీ క్రమంగా డౌన్‌ అయ్యింది.

జీ5లో టాప్‌ 10లో మరో తెలుగు సినిమా ఉంది. అదే రవితేజ నటించిన `భర్తమహాశయులకు విజ్ఞప్తి`. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రవితేజకి జోడీగా డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లో విడుదలై ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. కానీ ఓటీటీలో మాత్రం బాగానే వ్యూస్‌ సాధించింది. ఇప్పుడు 7వ స్థానంలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

అలాగే తెలుగు, తమిళంలో రూపొందిన `శబ్దం` మూవీ కూడా ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుంది. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ జీ 5లో ఆరో స్థానంలో ట్రెండ్‌ కావడం విశేషం. థియేటర్లో పెద్దగా ఆదరణ పొందని ఈమూవీ ఓటీటీలో మాత్రం రచ్చ చేయడం విశేషం. ఇలా టాప్‌ 10 లిస్ట్ చూస్తే,

ఓటీటీలో దుమ్మురేపుతున్న రవితేజ మూవీ

1.`ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్‌ హండా`(హిందీ మూవీ)

2.హే బల్వంత్‌(తెలుగు మూవీ)

3.భబిజి ఘర్‌ పర్‌ హై(హిందీ మూవీ)

4.అగా అగా సన్‌బయ్‌ క్యా మాంతా సాసుబాయ్‌?(హిందీ టీవీ సిరీస్‌)

5.మన శంకర వర ప్రసాద్‌ గారు(తెలుగు మూవీ)

జీ5 టాప్ 10లో ట్రెండింగ్ సినిమాలు ఇవే

6.శబ్దం(తెలుగు, తమిళ మూవీ)

7.భర్త మహాశయులకు విజ్ఞప్తి(తెలుగు మూవీ)

9.ప్రజాపతి 2(బెంగాలీ మూవీ)

10.ల్యాండ్‌లార్డ్(కన్నడ మూవీ)

టాలీవుడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏ సినిమా ఎప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.