|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫిబ్రవరి 14 మూవీ ఫీవర్: వాలెంటైన్స్ డేకి థియేటర్లలో సినిమాల జాతర! ఏ సినిమా చూడలో తెలుసా?

Published: 09-02-2026, 2:05 AM
ఫిబ్రవరి 14 మూవీ ఫీవర్: వాలెంటైన్స్ డేకి థియేటర్లలో సినిమాల జాతర! ఏ సినిమా చూడలో తెలుసా?
  • నాగచైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ ఫిబ్రవరి 14న రీ రిలీజ్ కానుంది.
  • ఉదయ్ కిరణ్ నటించిన ‘మనసంతా నువ్వే’ కూడా అదే రోజు విడుదల కానుంది.
  • విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ మూవీ ఫిబ్రవరి 13న విడుదల కాబోతోంది.
  • సంగీత్ శోభన్, మానస వారణాసిల ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ కూడా రిలీజ్ కి సిద్ధం.

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. నాగచైతన్య లవ్ స్టోరీ, ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే రీ రిలీజ్ అవుతుండగా.. విశ్వక్ సేన్ ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.

వాలెంటైన్స్ డే స్పెషల్ రీ రిలీజ్ సినిమాలు

February 14 Movies:ఫిబ్రవరి 7వ తేదీ నుండి వాలెంటైన్స్ వీక్ సందడి మొదలైంది.. ప్రేమికుల దినోత్సవానికి ముందు, ఆ తర్వాత కొన్ని చిత్రాలు రీ రిలీజ్ కి అలాగే కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.. ముఖ్యంగా ఈ వారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ అయ్యి.. మరోసారి సత్తా చాటింది. ఈ సినిమా ఈవారం మరో రెండు ప్రేమ కథా చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 15 వరకు థియేటర్లలోకి రాబోతున్న కొత్త సినిమాలేంటి? రీ రిలీజ్ కాబోయే చిత్రాలు ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఇకపోతే ఈ లవర్స్ డే సందర్భంగా యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)హీరోగా, సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరీ’ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. అలాగే దివంగత నటుడు ఉదయ్ కిరణ్ (Uday kiran), ప్రముఖ హీరోయిన్ రీమాసేన్ జంటగా వీ.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు నిర్మించిన ‘మనసంతా నువ్వే’ సినిమా కూడా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాబోతోంది.

ఇకపోతే ఈ వాలెంటైన్స్ డే వీక్ ను పురస్కరించుకొని కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. విశ్వక్ సేన్ హీరోగా నాగవంశీ నిర్మించిన ఫంకీ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రానికి సాయి సౌజన్య మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ ఆడియన్స్ ను విపరీతంగా నవ్వించగా.. సినిమా అంతకుమించి ఉంటుందని నాగ వంశీ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 9 నుండి విడుదలయ్యే కొత్త సినిమాలు

యంగ్ హీరో సంగీత్ శోభన్, మానస వారణాసి జంటగా తెరకెక్కిన చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, పాటలు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సీతా పయనం.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా పయనం’. ఈ చిత్రం ద్వారా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయబోతున్నారు. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అమరావతికి ఆహ్వానం – ఫిబ్రవరి 13

యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీస్

స్వీటీ నాటి క్రేజీ – ఫిబ్రవరి 13

వన్ ప్లస్ వన్ ఆఫర్ – ఫిబ్రవరి 13

ఈ వాలెంటైన్స్ డే వీక్ లో థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయని ఆశిద్దాం. ఏ సినిమా చూడాలనేది మీ ఇష్టం. అన్ని ప్రేమ కథా చిత్రాలే!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.