
📌 Key Points
- 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో కల్కి 2898 ఏడీ, పుష్ప ది రూల్, హనుమాన్ చిత్రాల మధ్య హోరాహోరీ పోటీ!
- బెస్ట్ ఫిల్మ్ రేసులో లక్కీ భాస్కర్, 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్లు చిత్రాలు కూడా నామినేషన్స్‌లో నిలిచాయి.
- పుష్ప 2 సినిమాకు దేవిశ్రీ ప్రసాద్, లక్కీ భాస్కర్ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రేసులో ఉన్నారు.
- సహాయక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, ఎస్ జే సూర్యలు తమ నటనతో అవార్డు కోసం పోటీపడుతున్నారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు పండుగలాంటి వార్త! 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ వచ్చేశాయి. ఈసారి అవార్డుల రేసులో ఎవరు గెలుస్తారో చూడటం చాలా ఆసక్తికరంగా ఉండనుంది.
ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్ విడుదల!
సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లాక్ లేడీ అవార్డ్స్ కోసం సమయం ఆసన్నమైంది. సినీ తారలు, అభిమానులు ఏడాది పొడవునా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్(70th Filmfare Awards) 2026 సందడి మొదలైంది. ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి, నామినేషన్లను అధికారికంగా ప్రకటించారు. 2024లో విడుదలైన చిత్రాల నుంచి ఉత్తమ ప్రతిభను గుర్తించి ఈ అవార్డులను అందించబోతున్నారు.
ఇక ఈ ఏడాది టాలీవుడ్ నామినేషన్లు చూస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తుడిచేసిన భారీ చిత్రాలతో పాటు, కంటెంట్ నమ్ముకుని వచ్చిన చిన్న సినిమాలు కూడా పోటీ పడుతుండటం విశేషం. ఈసారి ‘బెస్ట్ ఫిల్మ్’ కేటగిరీలో తీవ్రమైన పోటీ నెలకొంది. విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD), మాస్ జాతర ‘పుష్ప: ది రూల్'(Pushpa: The Rule), దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ రేసులో ముందున్నాయి. వీటితో పాటు విభిన్నమైన కథలతో మెప్పించిన ‘లక్కీ భాస్కర్’, చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన ’35 చిన్న కథ కాదు’, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘కమిటీ కుర్రోళ్లు’ కూడా నామినేషన్స్ దక్కించుకుని ఆశ్చర్యపరిచాయి.
నాగ్ ఆశ్విన్ (కల్కి 2898ఏడీ)
సుకుమార్ (పుష్ప: ది రూల్)
యధు వంశీ( కమిటీ కుర్రోళ్లు
వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
నంద కిశోర్(35 చిన్న కథ కాదు)
ఆషికా రంగనాథ్(నా సామి రంగ)
మీనాక్షి చౌదరి(లక్కీ భాస్కర్)
నివేథా థామస్(35 చిన్న కథ కాదు)
ప్రియాంక మోహన్(సరిపోతా శనివారం)
చిన్న చిత్రాల సత్తా చాటుతాయా?
రష్మిక మందన్న(పుష్ప: ది రూల్)
అనుపమ పరమేశ్వరన్(టిల్లు స్క్వేర్)
దుల్కర్ సల్మాన్(లక్కీ భాస్కర్)
అల్లు అర్జున్(పుష్ప: ది రూల్)
సిద్దు జొన్నలగడ్డ(టిల్లు స్క్వేర్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్
దేవీశ్రీ ప్రసాద్(పుష్ప-2)
జీవీ ప్రకాష్ కుమార్(లక్కీ భాస్కర్)
జెక్స్ బెజోయ్(సరిపోదా శనివారం)
గౌర హరి,అనుదీప్,కృష్ణ సౌరభ్(హనుమాన్)
సహాయక పాత్రల్లో మెప్పించిన నటీమణులు
హీరోల మధ్య అవార్డుల పోటీ!
శ్రద్ధాశ్రీనాథ్(మెకానిక్ రాకీ)
రషి సింగ్ నందు(ప్రసన్న వదనం)
ఫరియా అబ్దుల్లా(మత్తు వదలరా-2)
శరణ్య ప్రదీప్( అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)
అంజలి(గ్యాంగ్ ఆఫ్ గోదావరి)
వరలక్ష్మి శరత్ కుమార్(హనుమాన్)
సహాయక పాత్రల్లో మెప్పించిన నటులు
అమితాబ్ బచ్చన్(కల్కి2898ఏడీ)
ఫహాద్ ఫాజిల్(పుష్ప: ది రూల్)
ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సందడి మొదలైంది. ఏ సినిమా అవార్డు గెలుస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


