|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Flora Saini Tragic Story: ప్రేమించినవాడి చేతిలో నరకం చూసిన హీరోయిన్‌..

Published: 07-09-2025, 11:42 AM
Flora Saini Tragic Story: ప్రేమించినవాడి చేతిలో నరకం చూసిన హీరోయిన్‌..

తెలుగు, తమిళం, కన్నడం వంటి భాషల్లో నటించిన ఫ్లోరా సైని (ఆశా సైని) తన జీవితంలోని ఓ కష్టకాలాన్ని, ప్రేమించిన వ్యక్తి చేతిలో ఎదుర్కొన్న నరకాన్ని బయటపెట్టింది. ఆమె అనుభవాలు చాలా మందికి కంటి నీరు తెప్పించేవి.

Key Points

1

ఫ్లోరా సైని (ఆశా సైని) 1999లో సినీ ప్రస్థానం మొదలుపెట్టింది.

2

ప్రేమించిన నిర్మాత చేతిలో వేధింపులు, హింసను ఎదుర్కొంది.

4

ఇప్పుడు బిగ్ బాస్ 9 షోలో పాల్గొంటోంది.

ఫ్లోరా సైని సినీ జీవితం

ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని ( Flora Saini ). 1999లో ప్రేమ కోసం సినిమాతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. అప్పుడే నిర్మాత తనకు చెప్పకుండా ఆశా సైని అని మార్చాడు. నువ్వు నాకు నచ్చావ్‌, నరసింహ నాయుడు, ప్రేమతో రా, మైఖేల్‌ మదన కామరాజు, ఆ ఇంట్లో వంటి పలు చిత్రాల్లో నటించింది. లక్స్‌ పాప.. సాంగ్‌తో బాగా ఫేమస్‌ అయింది. తమిళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది.

ప్రేమలో నరకం

రానా నాయుడు, ద ట్రయల్‌ వెబ్‌ సిరీస్‌లలోనూ మెరిసింది. అందరమ్మాయిల్లాగే తనూ ప్రేమలో పడింది. నమ్మిన ప్రియుడి చేతిల్లో నరకం చూసింది. ఆ మధ్య తనపై దాడి జరిగినట్లుగా ఫోటోలు కూడా షేర్‌ చేసింది. ఆ ఒక్క వ్యక్తి వల్ల ప్రేమపై నమ్మకాన్నే కోల్పోయింది. నిస్సహాయ స్థితికి వెళ్లిపోయింది. ఆ ఘటన తర్వాత అమ్మానాన్నే తన ప్రపంచంగా భావించింది. ఇప్పుడు బిగ్‌బాస్‌ 9 షోలో అడుగుపెట్టింది.

బిగ్ బాస్ 9 ప్రయాణం

అసలేం జరిగిందంటే? 20 ఏళ్ల వయసులో ఓ నిర్మాతలో ప్రేమలో పడింది ఆశా సైని. అప్పటికే దాదాపు పది చిత్రాలు చేసింది. మోడల్‌గానూ పలు బ్రాండ్స్‌ ప్రమోట్‌ చేసింది. కానీ నిర్మాతను ప్రేమించిన కొద్దిరోజులకే పరిస్థితులు తారుమరయ్యాయి. అతడు ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఫోన్‌ లాక్కున్నాడు, నటించవద్దని బలవంతం చేశాడు. ఏడాదిన్నర పాటు ఎవరితోనూ తనను మాట్లాడనివ్వలేదు. ముఖం, ఇతర ప్రైవేట్‌ భాగాలపై కొట్టాడని ఫ్లోరా సైని సోషల్‌ మీడియాలో వాపోయింది. ఒకరోజు పొట్టపై తన్నడంతో నొప్పి, బాధ భరించలేక పారిపోయానని చెప్పుకొచ్చింది. తిరిగి మామూలు మనిషి కావడానికి కొన్ని నెలలు పట్టిందని తెలిపింది.

ప్రేమించిన వ్యక్తి చేతిలో తీవ్రమైన వేధింపులను ఎదుర్కొన్న ఫ్లోరా సైని తన అనుభవాలతో బిగ్ బాస్ 9లో ప్రేక్షకులను కదిలించనుంది. ఆమె ధైర్యం, పట్టుదల అందరికీ స్ఫూర్తి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.