
📌 Key Points
- ‘సొమ్మసిల్లి పోతున్నవే’ సాంగ్‌తో రాము రాథోడ్, దివ్య భగత్ జోడీ యూట్యూబ్‌లో సంచలనం!
- ఫోక్ సింగర్ రాము రాథోడ్ గాత్రానికి, నటనకు 31 కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డుల మోత!
- దివ్య భగత్‌తో రాము కెమిస్ట్రీ అదుర్స్, ప్రతి ప్రేమికుడు కరిగిపోయేలా సాంగ్!
- ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ఈ పాట.. యూట్యూబ్‌లో ఇంకా ట్రెండింగ్!
ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. రాము రాథోడ్ పాడిన ‘సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ’ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే షాక్ అవుతారు.
‘సొమ్మసిల్లి పోతున్నవే’: యూట్యూబ్‌లో రికార్డుల సునామీ!
ప్రస్తుతం తెలుగు ఫోక్ సాంగ్స్ హవా నడుస్తోంది. మట్టి వాసనతో, స్వచ్ఛమైన గ్రామీణ యాసతో సాగే ఈ పాటలు అందరి మనసులను గెలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ’ అనే పాట యూట్యూబ్‌లో సంచలనం రేపింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ పాటలోని మాధుర్యం, భావోద్వేగం ఏ అమ్మాయినైనా కరిగించేలా ఉంటుంది.
ఈ సాంగ్ ను ‘M S ADDA’ అనే యూట్యూబ్ ఛానల్ విడుదల చేసింది. ఈ పాటను ప్రముఖ ఫోక్ సింగర్ రాము రాథోడ్ పాడారు. పాటకు తన గాత్రంతో ప్రాణం పోశాడు. కేవలం పాడటమే కాకుండా, ఈ పాటలో రాము రాథోడ్ నటించారు. జోడీగా దివ్య భగత్ నటించగా, వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ సాంగ్‌ను విజువల్‌గా కూడా క్లాసిక్‌గా మార్చేసింది. యూట్యూబ్ లో ఇప్పటివరకు 31 కోట్లకు పైగా (318184426) వ్యూస్, 1.6M లైకులు వచ్చాయి. ఈ సూపర్ హిట్ ఫోక్ సాంగ్ పూర్తి లిరిక్స్ ఇలా ఉన్నాయి..
సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ
చెమ్మగిల్లి ముద్దియ్యవే చూపించవే నాపై ప్రేమ
నల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో
గుండె గాలిలో తేలుతూ ఆరాటాలాడుతు
సుట్టు దిప్పుకున్నావే ఓ సిన్నా రాములమ్మ
నీ సీర కొంగుకే ముడివెయ్యవే
సాయంకాలం వేళ సందె పొద్దులాగ సెంతలోనే ఉండవే
రాము రాథోడ్, దివ్య భగత్ జోడీతో ఫోక్ సాంగ్‌కు ఊహించని రెస్పాన్స్!
సీకటేల మెరిసే సుక్కలాగ గుండెలోన దాగవే
నీటిలోన నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే
నీ చేతినద్దేసి కలలన్ని చెరిపేసి కాలాన్ని మార్చకే
ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే
సక్కనైన సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే
ఏటి గట్టు మీద ఎదురుసూపుల్లోన కళ్ళల్లో నిండినవే
గాలివానల్లోన గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగిలికే
నీ ఊహలే కన్న నీ ధ్యాసలో ఉన్న నా దరికి రమ్మంటినే
నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నున్నా నా అడుగు నీ జాడకే
ప్రేమికుల ఫేవరెట్ సాంగ్.. లిరిక్స్‌తో మాయ చేస్తున్న రాము!
ముద్దుగున్నా నా చెలివే ఓ సిన్నా రాములమ్మ
సెంత సేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే
పారేటి సెలయేరు పలకరించకున్నా పరువాలేదనుకుంటినే
ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా పట్టించుకోవెందుకే
పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తినే
పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి మనువాడుకుంటానులే
జన్మ జన్మాల బంధానివే ఓ సిన్నా రాములమ్మ
నా సీకటి బ్రతుకుల ఎలుగియ్యవే నా ఇంటి దీపాన్ని ఎలిగించవే
‘సొమ్మసిల్లి పోతున్నవే’ పాట ట్రెండింగ్‌లో ఉండటంతో, రాము రాథోడ్, దివ్య భగత్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


