|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Friday Ott Releases: ఓటీటీ ప్రియులకు మరో దీపావళి.. ఒక్క రోజే 20 సినిమాలు స్ట్రీమింగ్!

Updated: 20-11-2025, 11:47 PM
Friday Ott Releases: ఓటీటీ ప్రియులకు మరో దీపావళి.. ఒక్క రోజే 20 సినిమాలు స్ట్రీమింగ్!

ఈ శుక్రవారం ఓటీటీ ప్రియులకు అక్షరాలా మరో దీపావళి. ఒక్కరోజే 20కి పైగా సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల చిత్రాలు అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో రిలీజైన చిత్రాలతో పాటు కొత్త కంటెంట్ కూడా రానుంది.

Key Points

1

ఈ శుక్రవారం ఒక్కరోజే 20కి పైగా సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానున్నాయి.

2

తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు ప్రాంతీయ భాషల చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి.

4

అక్షయ్ కుమార్ 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' కూడా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది.

ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సందడి

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ వారంలో సినీ ప్రియులను అలరించేందుకు తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా రిలీజవుతున్నాయి. టాలీవుడ్‌ నుంచి సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రిస్ వస్తుండగా.. దుల్కర్ సల్మాన్, రానా నటించిన డబ్బింగ్ మూవీ కాంత కూడా థియేటర్లలో సందడి చేయనుంది. వీటిలో కాంత, సంతాన ప్రాప్తిరస్తు సినిమాలపైనే ఓ రేంజ్‌లో హైప్ ఉంది.

ఇక బాక్సాఫీస్ వద్ద సంగతి అటుంచితే ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే అని చెప్పాలి. దీపావళి రిలీజైన చిత్రాలన్నీ ఓకేసారి మూకుమ్మడిగా ఓటీటీకి వచ్చేస్తున్నాయి. కిరణ్ అబ్బవరం  కె- ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్‌ డ్యూడ్‌ సినిమాలు రెండు రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో అక్షయ్ కుమార్‌ జాలీ ఎల్‌ఎల్‌బీ-3 కూడా ఓటీటీకి వచ్చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మరి.. మీకు నచ్చిన సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేయండి.

తెలుసు కదా(తెలుగు సినిమా)- నవంబర్ 14

డ్యూడ్ (తెలుగు సినిమా) – నవంబరు 14

ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 14

జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 14

నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ మూవీ) – నవంబరు 14

లెఫ్టర్- ది స్టోరీ ఆఫ్‌ ది ఆర్డినరీస్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 14

శుక్రవారం ఓటీటీలో వస్తున్న చిత్రాల జాబితా

ది క్రిస్టల్ కుక్కు(స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- నవంబరు 14

జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ మూవీ) – నవంబరు 14

అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 14

జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 14

నిశాంచి(హిందీ సినిమా) – నవంబర్ 14

మాలిస్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 14

దశావతార్ (మరాఠీ సినిమా) – నవంబరు 14

ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్) – నవంబరు 14

తెలుగుతో పాటు ఇతర భాషల రిలీజ్‌లు

కె ర్యాంప్ (తెలుగు సినిమా) – నవంబరు 15

మారుతం(తమిళ సినిమా)- నవంబర్ 14

దండకారణ్యం(తమిళ సినిమా)- నవంబర్ 14

కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 14

కప్లింగ్ (మలయాళ సిరీస్) – నవంబరు 14

పొయ్యమొళి (మలయాళ సినిమా) – నవంబరు 14

యోలో (తమిళ మూవీ) – నవంబరు 14

మొత్తంగా ఈ శుక్రవారం ఓటీటీ వేదికగా సినీ ప్రియులకు పూర్తిస్థాయి వినోదం అందుబాటులోకి రానుంది. వైవిధ్యమైన కథలతో కూడిన సినిమాలు, సిరీస్‌లతో ఈ వీకెండ్ నిజంగా పండగే. మీకు నచ్చిన సినిమాను ఎంచుకొని ఆనందించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.