
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుదీప్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నవ్వుల విందు అందించనుంది.
Key Points
విశ్వక్ సేన్ నటిస్తున్న 'ఫంకీ' మూవీ రిలీజ్ డేట్ ఖరారు చేయబడింది.
'ఫంకీ' చిత్రం 2026 ఏప్రిల్ 3న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కే.వి. అనుదీప్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక సినీ దర్శకుడి పాత్రను పోషిస్తూ అలరించనున్నాడు.
‘ఫంకీ’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన
వైవిధ్యమైన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ప్రజెంట్ ‘ఫంకీ’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా రిలీజ్ డేట్‌పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా.. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ‘ఫంకీ’ చిత్రాన్ని 2026 సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్‌తో వినోదాల విందుకి హామీ ఇచ్చిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో పెరరగా.. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షిస్తుంది.
కాగా.. కె.వి. అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. కొత్త లుక్, కొత్త యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ఈ మూవీపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా.. ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని హామీ ఇచ్చింది చిత్ర బృందం.
నిర్మాణం, దర్శకత్వ వివరాలు
విశ్వక్ సేన్ పాత్ర, అంచనాలు
‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఖరారు కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. వినోదాల విందుతో పాటు సరికొత్త అనుభూతిని పంచే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని ఆశిద్దాం.


