
📌 Key Points
- విశ్వక్ సేన్ హీరోగా, కయాడు లోహర్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘ఫంకీ’.
- సినిమా నిర్మాణంలో నిర్మాతకు ఎక్కువ ఖర్చు పెట్టించి ఇబ్బంది పెడతాడు హీరో.
- హీరో హీరోయిన్లు జీకే అనే వ్యక్తి వలన టార్గెట్ అవుతారు.
- భీమ్స్ సంగీతం అందించిన రెండు పాటలు సినిమాలో బాగున్నాయి.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఈ సినిమాలో కోమల్ అనే ఫిలిం డైరెక్టర్ నిర్మాతకు ఎక్కువ ఖర్చు పెట్టించి, జీకే అనే వ్యక్తి వలన టార్గెట్ అవుతాడు. సినిమా ఎలా ఉందో చూద్దాం.
ఫంకీ మూవీ కథాంశం
కథ : కోమల్(విశ్వక్ సేన్) ఓ ఫిలిం డైరెక్టర్. ‘మంచి ప్రొడక్షన్స్’ సంస్థ అధినేత(సీనియర్ నరేష్) బ్యానర్లో అతను ‘ఫంకీ’ అనే సినిమా మొదలుపెడతాడు. రూ.4 కోట్లు బడ్జెట్ అని చెప్పి .. దాన్ని రూ.40 కోట్ల వరకు తీసుకెళ్తాడు కోమల్. దీంతో ఒత్తిడి పెరిగి మంచాన పడతాడు నిర్మాత. ఆ కారణంగా సగంలో ఆగిపోతుంది సినిమా. ఈ క్రమంలో అతని కూతురు చిత్ర(కయాడు లోహర్) రంగంలోకి దిగి కోమల్ తో గొడవపడుతుంది. అయితే బ్యాలన్స్ షూటింగ్ ని కోటి రూపాయల్లోనే కంప్లీట్ చేస్తానని చెప్పి ఆమెను వలలో పడేస్తాడు కోమల్. అయితే ఊహించని విధంగా వీళ్ళు జీకే(సంపత్ రాజ్) కి టార్గెట్ అవుతారు. తర్వాత అతను వీళ్ళ సినిమాకి అడ్డుపడాలని చూస్తాడు? అది ఎందుకు? అసలు కోమల్ కి జీకేకి సంబంధం ఏంటి? చివరికి ఈ అడ్డంకులను దాటుకుని అతను సినిమాని కంప్లీట్ చేశాడా? అసలు కోమల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ : దర్శకుడు అనుదీప్ కేవీ కామెడీ టైమింగ్ ని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇష్టపడతారు. ఇక నాగవంశీ నిర్మాణంలో అనగానే ఓ మంచి ప్రోడక్ట్ బయటకి వస్తుంది అని అంతా ఆశిస్తారు. భీమ్స్ మంచి ఫామ్లో ఉన్న సంగీత దర్శకుడు. ఇలాంటి కాంబో అనగానే కచ్చితంగా మినిమమ్ గ్యారెంటీ సినిమా బయటకి వస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం ఎక్స్పెక్ట్ చేస్తాయి. కానీ వీటిలో ఏ ఒక్కటీ వర్కౌట్ కాలేదు అనే చెప్పాలి. టీజర్, ట్రైలర్స్ లో ఏ జోకులు అయితే పేలాయో అవన్నీ సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల్లోనే వచ్చేస్తాయి. వాటి సందర్భం కూడా ఆకట్టుకోదు.ఆ తర్వాత జోకులు వస్తాయి కానీ నవ్వుకునేలా అయితే ఉండవు. సిల్లీ ప్లాట్ తో బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ లో అమ్మ సెంటిమెంట్ పెట్టాలని చూశారు. అప్పటికే ఆడియన్స్ కి ఇరిటేషన్ పీక్స్ కి వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో ఉన్న కామెడీ అంతా సోషల్ మీడియాలో మరో సినిమాపై ట్రోలింగ్ చేయడానికి బాగుంటుంది అనిపిస్తుంది. ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఇంత చిల్లరగా ఉంటారా? అనే భావన ఆడియన్స్ కి కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అన్నీ ఎలా ఉన్నా హీరో విశ్వక్ సేన్ తో ‘నాకు గలీజ్ అనిపిస్తది’ అనే డైలాగ్ ని చాలా సార్లు చెప్పించారు. సినిమా చూస్తున్న ఆడియన్స్ కి కూడా అదే ఫీలింగ్ వస్తది అనడంలో సందేహం లేదు. భీమ్స్ సంగీతంలో రూపొందిన 2 పాటలు బాగున్నాయి. కానీ సినిమాలో వాటి ప్లేస్మెంట్ బాలేదు. ఎడిటింగ్ కూడా వీక్. కొన్ని సన్నివేశాల్లో జంప్ కట్స్ ఈజీగా తెలిసిపోతుంది. ఎడిటింగ్ ఎంత వీక్ అనేది వాటిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
విశ్లేషణ: మెప్పించని అంశాలు
నటీనటుల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా నటించాడు. కానీ హ్యూమర్ పండలేదు. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ మాత్రం బాగా చేశాడు. కయాదు లోహర్ క్యూట్ గా ఉంది. కానీ విశ్వక్ కి మ్యాచ్ అవ్వలేదు. అతని పక్కన పెద్దగా కనిపిస్తుంది. సీనియర్ నరేష్ కామెడీ పండలేదు. సంపత్ రాజ్ సీరియస్ గా కనిపిస్తూనే కామెడీ పండించాడు. మిగతా నటీనటులు జస్ట్ ఓకే
మొత్తంగా ‘ఫంకీ’ ఎలా ఉంది అని ఎవరైనా అంటే.. సినిమాలో హీరో విశ్వక్ సేన్ చెప్పినట్టే ‘గలీజ్ అనిపిస్తది’ అని చెప్పడంలో ఎటువంటి విడ్డూరం లేదు
పాటలు, సంగీతం ఎలా ఉంది?
మొత్తానికి, ‘ఫంకీ’ సినిమా కొన్ని కామెడీ సన్నివేశాలతో పరవాలేదనిపించినా, కథనం మరియు ఇతర అంశాలలో మెరుగుదల అవసరం. విశ్వక్ సేన్ నటన ఒక ఆకర్షణగా నిలిచింది. కానీ సినిమా మొత్తం మీద నిరాశపరిచింది.


