|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్: నవ్వులు పంచేందుకు సిద్ధమైన అనుదీప్ మార్క్ కామెడీ!

Published: 07-02-2026, 9:05 AM
విశ్వక్ సేన్ 'ఫంకీ' ట్రైలర్: నవ్వులు పంచేందుకు సిద్ధమైన అనుదీప్ మార్క్ కామెడీ!
  • విశ్వక్ సేన్ ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో నటించారు.
  • కయాదు లోహర్ నిర్మాత పాత్రలో కనిపించనున్నారు.
  • భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
  • ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.

విశ్వక్ సేన్ నటించిన ఫంకీ సినిమా ట్రైలర్ విడుదలైంది. అనుదీప్ శైలిలో తెరకెక్కిన ఈ చిత్రం కామెడీ ప్రధానంగా ఉండబోతోంది. ఇందులో విశ్వక్ సేన్ ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 13న సినిమా విడుదల కానుంది.

అనుదీప్ శైలిలో ఫంకీ ట్రైలర్

Funky Trailer: ఈరోజు విడుదలైన ఫంకీ సినిమా ట్రైలర్ చూస్తే మొదటి సీన్ నుంచే ఇది పూర్తిగా అనుదీప్ స్టైల్ సినిమా అని అర్థమైపోతుంది. “మీ అమ్మకి ఆపరేషన్ చేయాలి” అని డాక్టర్ అనగానే, అక్కడ ఉన్న వ్యక్తి “నాకు ఆపరేషన్ చేయడం రాదండి” అని చెప్పే సీన్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ ఒక్క డైలాగ్‌తోనే దర్శకుడు అనుదీప్ KV మార్క్ హ్యూమర్ ఈ సినిమా మొత్తం ఉండబోతుందని అర్థమైపోతుంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో.. సినిమా దర్శకత్వం చేయాలనుకునే కోమలి పాత్రలో ఆయన నటించగా.. ఆ సినిమాకి నిర్మాతగా హీరోయిన్ కయాదు లోహర్ కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే తమాషా సంఘటనలే ఈ సినిమాకు ప్రధాన బలం అని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ట్రైలర్ చూస్తే కథ కంటే ఎక్కువగా సిట్యుయేషన్ కామెడీ.. డైలాగ్స్ మీదే సినిమా నడుస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది.

ట్రైలర్ మొత్తం కూడా ఫంకీ, వెరైటీ డైలాగ్స్‌తో నిండిపోయి ఉంది. ముఖ్యంగా హీరో తల్లి ..2000 రూపాయిలో 5000 రూపాయలు చీర చూపించండి.. అని అనడం, ఆ తర్వాత “మాత వరుసగా అన్నాను” అంటే అయితే వరుసగా పడుకోండి రా.. అని చెప్పే డైలాగ్ అలానే టెన్త్ క్లాస్లో.. నువ్వు ఫస్ట్ క్లాస్ ఆ అంటే కాదు టెన్త్ క్లాస్.. అని వచ్చే డైలాగ్స్ అనుదీప్ స్టైల్‌తో ఈ సినిమా నిండిపోనుంది అని ఈ ట్రైలర్ స్పష్టంగా చూపించింది. ఇవన్నీ చూసినప్పుడు జాతి రత్నాలు ఫీల్ మళ్లీ గుర్తుకు వస్తుంది.

విశ్వక్ సేన్, కయాదు లోహర్ పాత్రలు

హీరోయిన్‌గా డ్రాగన్ ఫేమ్ కయాదు లోహర్ నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కామెడీకి మంచి సపోర్ట్ ఇస్తుందని ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది భీమ్స్ సిసిరోలియో, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత ఎనర్జీ ఇచ్చింది.

ఫంకీ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శ్రీ రాములు థియేటర్ లో గ్రాండ్‌గా జరగక.. ట్రైలర్ యూట్యూబ్‌లో సాయంత్రం విడుదల అయింది.

ఫిబ్రవరి 13న విడుదల, కామెడీ ట్రీట్

ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా, నవ్వులు పూయించే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

మొత్తానికి ఫంకీ ట్రైలర్ కామెడీతో నిండిపోయింది. అనుదీప్ మార్క్ డైలాగులు, సన్నివేశాలతో సినిమా ప్రేక్షకులను కచ్చితంగా నవ్విస్తుందని చెప్పవచ్చు. ఫిబ్రవరి 13 వరకు వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.