|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ వేడుక.. బన్నీ స్పెషల్ అట్రాక్షన్

Published: 14-06-2025, 11:40 AM
Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ వేడుక.. బన్నీ స్పెషల్ అట్రాక్షన్

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ సినిమా అవార్డుల వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచారు. 2014 నుండి 2024 వరకు విడుదలైన సినిమాలకు అవార్డులు ప్రదానం చేశారు.

Key Points

1

గద్దర్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

2

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

4

ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్, మేకప్ ఆర్టిస్ట్ తదితర అవార్డులు వివిధ సినిమాలకు లభించాయి.

అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డులు

తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఈ వేడుకకు వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు ఎంతోమంది హాజరయ్యారు. అయితే ప్రత్యేక్ష ఆకర్షణగా అల్లు అర్జున్ నిలిచాడు. బన్నీతో పాటు విజయ్ దేవరకొండ కూడా కనిపించడం విశేషం.

బన్నీ, విజయ్ దేవరకొండ హాజరు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్ రాజు.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014 నుంచి 2024 వరకూ గద్దర్ అవార్డులను ఇప్పుడు ఇవ్వబోతున్నారు. సదరు పురస్కార గ్రహీతలకు సిల్వర్ మెమొంటో, రూ.5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రశంసా పత్రం అందిస్తారు. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. వేల మంది ఈవెంట్‌కు హాజరయ్యారు.

వివిధ సినిమాలకు అవార్డులు

ఇప్పటివరకు ‘గామి’ సినిమాకుగాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా అద్నితిన్ జిహానీ చౌదరి.. ‘కల్కి 2898ఏడీ’ సినిమాకు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను (రజాకార్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు- అజయ్ కుమార్ (కల్కి), ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ (గామి), ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి (లక్కీ భాస్కర్), ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్,  ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి) అవార్డులు అందుకున్నారు.

గద్దర్ అవార్డుల వేడుక సినీ ప్రముఖులతో సందడిగా ముగిసింది. విజేతలందరికీ అభినందనలు! భవిష్యత్తులో మరింత మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.