
📌 Key Points
- రాజు వెడ్స్ రాంబాయి: ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది, గద్దర్ అవార్డు గెలుచుకుంది.
- తండేల్: నెట్ ఫ్లిక్స్ లో చూడండి, జాతీయ సమగ్రతా చిత్రంగా అవార్డు పొందింది.
- ప్రైమ్ వీడియోలో శివాజీ మూవీ: పరువు హత్యల నేపథ్యంలో ఉత్తమ చిత్రం.
- తేజ సజ్జా మిరాయ్ చిత్రం: జియో సినిమాలో బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో గద్దర్ అవార్డు కొట్టింది.
గతేడాది గద్దర్ అవార్డ్స్ ప్రకటనతో టాలీవుడ్ లో సందడి నెలకొంది. ఓటీటీలో విడుదలైన చిత్రాల్లో ఏవి అవార్డులు గెలుచుకున్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం మీకోసమే! టాప్ 7 మూవీస్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాప్ మూవీస్
గతేడాది 2025లో విడుదలైన చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది. గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాప్ 7 మూవీస్ లిస్ట్ ఈ కథనంలో ఉంది. ఇవన్నీ ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు. ఏ మూవీ ఏ ఓటీటీలో ఉందో కంప్లీట్ డీటెయిల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం లాంటి పెద్ద సినిమాలు గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్నాయి.
ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించారు. ఈ చిత్రం యువతని మెప్పించి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు గద్దర్ అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎక్కడ చూడాలి : ఈటీవి విన్
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ మంచి విజయం సాధించింది. ఆంధ్రాకి చెందిన జాలర్లు పాకిస్తాన్ లో చిక్కుకుపోయిన సంఘటనల ఆధారంగా దర్శకుడు చందూ ముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ఈ మూవీకి గద్దర్ అవార్డు దక్కింది.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
ఏ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?
శివాజీ, నందు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కింది. మంచి సందేశాత్మక చిత్రంగా ఆకట్టుకుంది. గద్దర్ అవార్డ్స్ లో ఈ మూవీ ఉత్తమ ద్వితీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
గతేడాది యువతని విపరీతంగా ఆకట్టుకున్న యూత్ ఫుల్ మూవీస్ లో లిటిల్ హార్ట్స్ ఒకటి. ఈ మూవీలో హీరో మౌళి తనూజ్, హీరోయిన్ శివాని నాగారం పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. ఉత్తమ ఫీచర్ ఫిలిం డెబ్యూ విభాగంలో ఈ చిత్రానికి గద్దర్ అవార్డు దక్కింది.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
గతేడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరెకెక్కిన ఈ మూవీ గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచింది.
మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే!
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
యువ హీరో తేజ సజ్జా ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మిరాయ్ చిత్రం. సూపర్ హీరో మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో తేజ సజ్జా అదరగొట్టారు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రం గద్దర్ అవార్డు గెలుచుకుంది.
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్
నేచరుల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ప్రియదర్శి, హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో శివాజీ నటన హైలైట్. ఈ చిత్రానికి ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రంగా గద్దర్ అవార్డు దక్కింది.
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న ఈ చిత్రాలను ఓటీటీలో చూసి ఆనందించండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


