
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. ఈ నేపథ్యంలో నిర్మాత శిరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదంగా మారింది. దీనికి ఆయన క్షమాపణలు చెబుతూ ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు.
Key Points
గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ తో నిర్మాత శిరీష్ కష్టాల్లో పడ్డారు.
శిరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్ అభిమానుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
క్షమాపణలు చెబుతూ శిరీష్ ఎమోషనల్ వీడియో విడుదల చేశారు.
గేమ్ చేంజర్ వివాదం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు(dilraaju), శిరీష్ రూ. 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. అంతేకాకుండా నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత శిరీష్ ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అవడంపై వివాదాస్పద కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఇక ఈ విషయంపై రామ్ చరణ్ ఫ్యాన్స్ హెచ్చరిస్తూ ఓ లేఖను రిలీజ్ చేశారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ఈ వివాదానికి చెక్ పడలేదు. శిరీష్‌పై పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేయడంతో పాటు బెదిరిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, శిరీష్ ఓ ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు.
‘‘మా సంస్థకు, చిరంజీవికి, రామ్ చరణ్ కి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో చరణ్ గారు ఒకరు. ఆయన్ని అవమానపరచడం కానీ, కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడూ చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన గురించి చిన్న మాట దొర్లినా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి నిజంగా క్షమాపణలు చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నా. ఆయనతో నాకు ఉన్న రిలేషన్ ని పాడు చేసుకోదలుచుకోలేదు. బయట జనాలు మాట్లాడుతున్న మాటలు, ట్రోలింగ్స్, అభిమానుల బాధ నేను అర్ధం చేసుకోగలను. ఎందుకంటే ఒక హీరోని ఎవరైనా అంటే వాళ్ళ ఫ్యాన్స్ భరించలేరు. నా ఇంటెన్షన్ అది కాదు. మాకు ఉన్న రిలేషన్, మాకున్న క్లోజ్ నెస్ తో నేను మాట దొర్లాను తప్ప ఆయనని అవమానపరచడానికి కాదు. మాకు మెగా హీరోలందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. చరణ్‌కు క్షమాపణలు చెబుతున్నాను.
శిరీష్ క్షమాపణలు
అందరితో సినిమాలు చేసాము. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళని నేను అవమానించేంత మూర్ఖుడిని కాదు. దయచేసి అభిమానులు అర్థం చేసుకోండి. సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’(Game changer) సినిమాతో పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) కూడా రిలీజ్ చేసాం. ఆయన ఒప్పుకోకపోయి ఉంటే రిలీజ్ అయ్యేది కాదు. చరణ్ గారే మా గురించి ఆలోచించి, మా ఫైనాన్షియల్ ఆలోచించి రిలీజ్ చేసుకోమన్నారు. అలాంటి ఆయన్ని ఎందుకు అవమానపరుస్తాను. ఒకవేళ నా మాటలు ఎవరినైనా బాధపెడితే ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి మా రిలేషన్ ని పాడు చేయొద్దు. మళ్ళీ రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నాం. ఇలాంటి సమయంలో మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తీసుకురావద్దు అని అందరినీ కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇకనైనా ఈ వివాదానికి చెక్ పడుతుందో లేదో చూడాలి.
రామ్ చరణ్ అభిమానుల ప్రతిస్పందన
A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)
శిరీష్ చేసిన తప్పును అభిమానులు అర్థం చేసుకుని, రామ్ చరణ్ తో ఉన్న మంచి బంధాన్ని కాపాడుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ వివాదం త్వరలోనే సద్దుమణిగే అవకాశం ఉంది.


