
📌 Key Points
- దీపను అంతమొందించేందుకు జ్యోత్స్న పక్కా స్కెచ్ వేసింది, కార్తీక్ అనుమానం!
- పార్టీలో దీపపై పారిజాతం ప్రేమ కురిపిస్తూ ఆశ్చర్యపరిచింది.
- శౌర్యను కావాలనే కింద పడేసిన జ్యోత్స్న.. పారుమాత్రం ఊరుకోలేదు!
- జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారు.. సీరియల్ లో ఊహించని ట్విస్ట్!
కార్తీక దీపం 2 సీరియల్ లో ఊహించని ట్విస్ట్! దీప జీవితం ప్రమాదంలో పడింది. జ్యోత్స్న ఒక భయంకరమైన ప్లాన్ తో వస్తుంది. అసలేం జరగబోతుందో చూడాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి!
జ్యోత్స్న ప్లాన్ తో దీపకు ముప్పు?
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 1 ఎపిసోడ్ లో ఓ వైపు దీపను చంపాలని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసిందని కార్తీక్ కు అనుమానం వస్తుంది. గెట్ టుగెదర్ పార్టీ కోసం కార్తీక్ ఫ్యామిలీతో కలిసి జ్యోత్స్న ఇంటికి వస్తాడు. దీపపై పారిజాతం ప్రేమ కురిపిస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 1 ఎపిసోడ్ లో.. వీలునామా గురించి మళ్లీ పంచాయతీ పెట్టినట్లుంది. అందుకే పార్టీ అని పిలుస్తుందని జ్యోత్స్న గురించి కాంచనతో అనసూయ అంటుంది. అన్నయ్య పెట్టిన నిబంధనకు జ్యోత్స్న ఒప్పుకోకపోతే ఆస్తి నీకు చెందుతుంది కదా కార్తీక్, దాని బాధంతా అదేనని కాంచన అంటుంది.
పార్టీలో పారిజాతం ప్రేమ!
ఇంట్లోకి వెళ్లిన తర్వాత దీప, శౌర్యపై పారు తెగ ప్రేమ ఒలకబోస్తుంది. ఐస్ క్రీమ్ కోసం శౌర్య పరుగెడుతూ జ్యోత్స్నను ఢీ కొట్టి పడిపోతుంది. వెంటనే శౌర్యను పారు పైకి లేపి జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది.
శౌర్య కోసం పారు ఫైటింగ్!
నువ్వు శౌర్యను పడేశావ్. నీ కళ్లు కాకులు ఎత్తుకెళ్లాయి. నువ్వు అడ్డుగా రాకపోయి ఉంటే శౌర్య వంట గదిలోకి వెళ్లుండేది. చూసి డాష్ ఇచ్చినా, చూడకుండా డాష్ ఇచ్చినా శిక్ష ఒక్కటే. సారీ చెప్పు అని జ్యోత్స్న చెంపపై పారు కొడుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ లో ఏం జరుగుతుందో చూడటానికి మీరంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


