|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విధి విలాసం! 35 ఏళ్లకే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటుడి మృతి.. విషాదంలో చిత్ర పరిశ్రమ!

Published: 09-04-2026, 6:05 AM
విధి విలాసం! 35 ఏళ్లకే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటుడి మృతి.. విషాదంలో చిత్ర పరిశ్రమ!
  • హాలీవుడ్ నటుడు మైఖేల్ పాట్రిక్ 35 ఏళ్లకే అరుదైన వ్యాధితో కన్నుమూశారు.
  • ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌తో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
  • మైఖేల్ మోటార్ న్యూరాన్ డిసీజ్ (MND)తో గత మూడు సంవత్సరాలుగా పోరాడారు.
  • ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ పాట్రిక్ 35 ఏళ్ల వయసులోనే అరుదైన వ్యాధితో మరణించారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌తో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మైఖేల్ పాట్రిక్ మరణం

Film industry: రంగుల ప్రపంచంలో వెండితెరపై అలరించి.. తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకోవాలని ఎంతోమంది సెలబ్రిటీలు పరితపిస్తుంటారు.. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దొరికిన చిన్న పాత్ర అయినా సరే ఆ పాత్రతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకోవాలని ప్రయత్నించే వారు కూడా లేకపోలేదు. అలా వెండితెరపై రంగుల ప్రపంచంలో తమ జీవితాన్ని ఉన్నతంగా తీసుకువెళ్లాలి అనే తపనలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చాలామంది ఉన్నారు.. అయితే అనారోగ్య సమస్యలను జయించి మళ్లీ తమను తాము పునర్నిర్మించుకుంటే.. మరి కొంతమంది ఆ అనారోగ్య సమస్యలతో పోరాడలేక తుది శ్వాస విడుస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు ఒక ప్రముఖ నటుడు గురించి చెప్పుకోవాలి. తన విలక్షణమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆ యువ నటుడు 35 ఏళ్ల వయసులోనే అరుదైన వ్యాధితో మరణించడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. మరి ఆ నటుడు ఎవరు? ఆయనను సోకిన ఆ మహమ్మారి ఏంటి ? అసలు ఏం జరిగింది? దీని చికిత్స సంగతేమిటి? అనే విషయాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

ఆయన ఎవరో కాదు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ పాట్రిక్.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ డ్రామా సిరీస్తో  భారీ పాపులారిటీ అందుకున్న ఈయన గత కొంతకాలంగా మోటార్ న్యూరాన్ డిసీజ్ (MND) తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. శరీర కండరాల కదలికలను నియంత్రించే నరాలను దెబ్బతీసే ఈ అరుదైన వ్యాధితో గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నారు మైఖేల్. 2023 లో వచ్చిన ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చివరి వరకు ఆశాభావంతో ఉన్న మైఖేల్ నార్తర్న్ ఐర్లాండ్ హాస్పిటల్లో ఈ వ్యాధితో పోరాడుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన భార్య ధ్రువీకరించారు.

మోటార్ న్యూరాన్ డిసీజ్ (MND) అంటే ఏమిటి?

ఇకపోతే మైఖేల్ కి వచ్చిన ఈ వ్యాధికి ఎటువంటి నివారణ లేదు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చికిత్స లేని వ్యాధి కాబట్టి ఆయన మూడు సంవత్సరాలుగా ఈ వ్యాధితో పోరాడినప్పటికీ ..ఎంత చికిత్స తీసుకున్నా ఫలితం లేక తుది శ్వాస విడిచినట్లు సమాచారం.. ఇక ప్రస్తుతం ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, నెటిజెన్స్ తో పాటు ఆయన అభిమానులు దుఃఖానికి లోనవుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన భార్య, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

సినీ ప్రముఖుల సంతాపం

ఇకపోతే మైఖేల్ ను ఆవహించిన ఈ మోటార్ న్యూరాన్ డిసీజ్ యొక్క లక్షణాలు ఏంటి? అనే విషయానికి వస్తే చేతులు , కాళ్లు బలహీనపడడం, కండరాల నొప్పులు , మాట సరిగ్గా రాకపోవడం, మింగడంలో ఇబ్బంది ప్రధాన ప్రాథమిక లక్షణాలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఈ వ్యాధి కారణంగా కండరాలు స్వచ్ఛందంగా కదలలేని పరిస్థితికి చేరుకుంటాయి. కండర కదలికలను నియంత్రించే ఎక్కువ, దిగువ మోటారు న్యూరాన్ లపై ఈ వ్యాధి దాడి చేస్తుంది. క్రమంగా కండరాల క్షీణత.. చివరికి పక్షవాతం వస్తుంది. ఇకపోతే చాలా కేసులు అకస్మాత్తుగా సంభవిస్తే.. దాదాపు 5 నుండి 10 శాతం వంశపారపర్యంగా కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోయినప్పటికీ ఫిజికల్ థెరపీ, సరైన పోషకాహారం తీసుకోవడం వంటి పద్ధతుల ద్వారా వ్యాధి పురోగతిని తగ్గించవచ్చు అని వైద్యులు తెలియజేస్తున్నారు.

మైఖేల్ పాట్రిక్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.