
న్యూమరాలజీ ప్రకారం, పుట్టిన తేదీ ఆధారంగా గణపతి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. రాడిక్స్ నెంబర్ లెక్కించి, మీ జీవితంలో గణపతి ప్రభావం ఏమిటో తెలుసుకోండి.
Key Points
పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్ లెక్కించండి.
1, 3, 5, 9 రాడిక్స్ నెంబర్లు గణపతి అనుగ్రహాన్ని సూచిస్తాయి.
ఈ సంఖ్యలతో పుట్టిన వారికి జీవితంలో విజయం, సంతోషం లభిస్తుంది.
న్యూమరాలజీ సూచనలను మాత్రమే నమ్మకండి, నిపుణుల సలహా తీసుకోండి.
రాడిక్స్ నెంబర్ లెక్కింపు
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి జీవితం కూడా వారి పుట్టిన తేదీతో ముడిపడి ఉంటుంది. గ్రహాలు, రాశులలాగే న్యూమరాలజీలో సంఖ్యలు మన జీవితాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తాయి.
మనం పుట్టిన తేదీ ద్వారా రాడిక్స్ నెంబర్‌ని కనుగొనవచ్చు. రాడిక్స్ నెంబర్ ఆధారంగా వ్యక్తిత్వం, తీరుతో పాటు చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎల్లప్పుడూ గణపతి అనుగ్రహం ఉంటుంది. గణపతి ప్రత్యేక ఆశీస్సులతో సంతోషంగా ఉంటారు. మరి ఎవరు వినాయకుని ఆశీస్సులను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టిన తేదీని బట్టీ రాడిక్స్ నెంబర్‌ని ఇలా కనుగొనవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా 14వ తేదీలో పుట్టినట్లయితే 1 + 4 = 5. ఈ లెక్కన వారి రాడిక్స్ నెంబర్ 5 అవుతుంది.
గణపతి అనుగ్రహం ఉన్న రాడిక్స్ నెంబర్లు
ఎవరైనా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు జీవితంలో సక్సెస్‌ను అందుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. వినాయకుని అనుగ్రహంతో జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగిపోతాయి, సమస్యలన్నీ తొలగి సంతోషంగా ఉంటారు.
రాడిక్స్ నెంబర్ 3కి అధిపతి గురువు . ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 3 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి కూడా వినాయకుని అనుగ్రహం లభించి సంతోషంగా ఉంటారు. గణపతిని పూజించడం వలన జీవితంలో పురోగతి ఉంటుంది. విద్య, కెరియర్, బిజినెస్‌లో కూడా కలిసి వస్తుంది.
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 5 అవుతుంది. వినాయకుని ప్రత్యేక అనుగ్రహంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వినాయకుడు వీరి వైవాహిక జీవితంలో సంతోషాన్ని కలిగిస్తాడు. ఇతరుల హృదయాలను కూడా సులువుగా గెలుచుకుంటారు.
జ్యోతిష్య నిపుణుల సలహా
ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 9 అవుతుంది. వీరు ఎల్లప్పుడూ వినాయకుని అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. వినాయకుడి ఆశీస్సులతో ఏ బాధ అయినా సరే తొలగిపోతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఈ సమాచారం సూచనార్థం మాత్రమే. ఖచ్చితమైన సమాచారం కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి. గణపతిని స్మరించుకోవడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది.


