
టాలీవుడ్‌లో ఆనంది నటిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమా తాజా అప్డేట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. సినిమాలోని ఫోక్ సాంగ్ విడుదల తేదీని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
Key Points
ఆనంది నటించిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా ఫోక్ సాంగ్ విడుదలకు సిద్ధం
ఆగస్టు 4న ‘నల జిలకర మొగ్గ’ అనే ఫోక్ సాంగ్ విడుదల
ఈ సినిమా బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది
‘గరివిడి లక్ష్మి’ ఫోక్ సాంగ్ రిలీజ్ డేట్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆనంది(Anandhi) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi). లేడీ ఓరియెంటెడ్ మూవీగా రాబోతుండగా.. కొత్త దర్శకుడు గౌరీ నాయుడు జమ్మూ (Gauri Naidu Jammu)ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.
చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో రాగ్ మయూరి, రాశి, శరణ్య, ప్రదీప్, నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం బుర్రకథ కళాకారణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. అలాగే ఆ పేరుతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
ఆనంది మాస్ డ్యాన్స్
తాజాగా, ‘గరివిడి లక్ష్మి’ నుంచి ఓ మాస్ బీట్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫోక్ సాంగ్ ‘నల జిలకర మొగ్గ’ ఆగస్టు 4న రాబోతున్నట్లు తెలుపుతూ ‘‘గరివిడి లక్ష్మి నృత్యం చూసే సమయం వచ్చింది’’ అనే క్యాప్షన్ జత చేసి ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో ఆనంది లంగా ఓణిలో మాస్ స్టెప్ వేస్తుండగా.. పక్కన నాటకాలు వేసేవారు నిల్చొని ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది.
సినిమా కథాంశం
A post shared by @peoplemediafactory
‘గరివిడి లక్ష్మి’ సినిమా ఫోక్ సాంగ్ విడుదలతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఆనంది నటన, మాస్ డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు.


