|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గెట్ రెడీ ‘SSMB-29’ నుంచి బిగ్ అప్డేట్ రాబోతుంది.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇస్తూ రాజమౌళి పోస్ట్

Published: 07-11-2025, 12:07 AM
గెట్ రెడీ ‘SSMB-29’ నుంచి బిగ్ అప్డేట్ రాబోతుంది.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇస్తూ రాజమౌళి పోస్ట్

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘SSMB-29’ చిత్రంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి డబుల్ ధమాకా అప్‌డేట్‌ను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం నెలకొంది.

Key Points

1

SSMB-29 చిత్రం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది.

2

రాజమౌళి ట్విట్టర్ ద్వారా బిగ్ అప్‌డేట్ ప్రకటించారు.

4

నవంబర్ 15న globetrotter ఈవెంట్ జరగనుంది.

SSMB-29పై భారీ అంచనాలు

సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘SSMB-29’. ఈ సినిమా మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి (Rajamouli)కాంబినేషన్‌లో రాబోతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్‌పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటించినప్పటినుంచి ఇందుకు సంబంధించిన వార్తలెన్నో వస్తున్నప్పటికీ రాజమౌళి అప్డేట్స్ మాత్రం ఇవ్వకుండా అభిమానులను నిరాశ చెందుతున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

రాజమౌళి ఇచ్చిన డబుల్ ధమాకా అప్‌డేట్

ఇక గత కొద్ది కాలంగా అప్డేట్స్ వస్తాయని ఎదురుచూస్తున్న అభిమానులకు నిత్యం నిరాశనే ఎదురవుతోంది. అయినప్పటికీ ఒక్క పోస్టర్ అయినా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే.. నవంబర్ 15న అప్డే్ట్ రాబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి ఈనేపథ్యంలో.. తాజాగా, రాజమౌళి ట్విట్టర్ ద్వారా బిగ్ అప్డేట్ ఇచ్చారు. ‘‘సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో మా క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. మరోవైపు globetrotterఈవెంట్ కోసం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఇది మీ ముందుకు రానుంది.

పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్, నవంబర్ 15 ఈవెంట్

నవంబర్ 15న మీరంతా ఈ కార్యక్రమాన్ని చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. ఆ రోజు కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. దానికంటే ముందు మీరు ఈ వారమంతా మరింత హుషారుగా ఉండేందుకు ఈరోజు పృథ్వీరాజ్ ఫస్ట్ విడుదల చేయబోతున్నాం సిద్ధంగా ఉండండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతూ.. ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

రాజమౌళి ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో SSMB-29పై అంచనాలు మరింత పెరిగాయి. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్, నవంబర్ 15న రాబోయే globetrotter ఈవెంట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.